EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వీటి కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రజలకు పన్ను రాయితీలను సైతం అమలుచేస్తోంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు కొత్త పాలసీని సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు.. మన దేశంలోనే EVలను మాన్యుఫ్యాక్చర్ చేసే విధంగా కేంద్రం చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. వీటి దిగుమతులకు కూడా 5 ఏళ్ల పాటు పన్ను తగ్గింపు వంటి సౌలభ్యం కల్పించాలని భారత ప్రభుత్వం చూస్తోంది. భవిష్యత్తులో స్థానిక ఉత్పత్తి హామీతో, ఇంపోర్టెడ్ బ్యాటరీలతో నడిచే వాహనాలకూ రాయితీ వర్తింప చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా టెస్లా వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇతర దేశాల్లో తయారు చేసిన వాహనాలను ఇండియాలో విక్రయించడమే కాకుండా.. భవిష్యత్తులో దేశీయ మాన్యుఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహించేందుకు పావులు కదుపుతోంది.
ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాలకు హాజరయ్యేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. టెస్లా CEO ఎలాన్ మస్క్ ఈ వారంలో ఆయన్ను కలిసి చర్చించే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications