Windfall Tax: చమురు ఉత్పత్తి దేశాలు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో రేట్లు పెరగటం ప్రారంభమైంది. ఇది ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలపై పడుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం ముడి చమురు ఉత్పత్తిపై విధిస్తున్న విండ్‌ఫాల్ టాక్స్‌ను తొలగించింది. దీనికి ముందు టన్నుకు రూ.3,500 చొప్పున చమురుపై పన్నును కేంద్రం వసూలు చేసింది. డీజిల్‌పై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు గతంలో ఉన్న 1 రూపాయి నుంచి 50 పైసలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, ATFపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా తొలగిస్తున్నట్లు ఇవాళ ప్రకటించింది. చమురు కంపెనీలు ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు విండ్‌ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది.

జూలైలో కంపెనీలకు అధిక లాభాలు వస్తున్న తరుణంలో ఈ పన్నును విధించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలను అనుకరిస్తూ జూలై 2022లో ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు టన్నుకు రూ.23,250గా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఆ తర్వాత మార్చి 21, 2023న దానిని టన్నుకు రూ.3,500కి తగ్గించింది. అయితే తాజాగా ఒపాక్ దేశాల కూటమి ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతో సోమవారం చమురు ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.58 డాలర్లకు చేరుకుంది.
గత సంవత్సరం రెండవ అర్థభాగంలో భారత్ బ్యారెల్ చమురును 73-74 డాలర్ల శ్రేణిలో కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిపుణుల అంచనా ప్రకారం రానున్న కాలంలో చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం మెుండిగా కొనసాగుతున్న తరుణంలో పెరుగుతున్న చమురు ధరలు పరిస్థితులను మరింత క్లిష్టతరంగా మారతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications