Charges on UPI: దేశంలో డీమానిటైజేషన్ తర్వాత ప్రజలకు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు మరింత చేరువ అయ్యాయి. వాస్తవానికి ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీల రాక ఈ చర్యను మరింత ప్రభావవంతంగా చేసింది. దీంతో దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా నేడు ప్రజలు తమ చెల్లింపులను పూర్తిగా డిజిటల్ యాప్స్ ద్వారా చేయగలుగుతున్నారు.
అయితే ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులతో పాటు రూపే కార్డ్ పేమెంట్స్ కూడా ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల త్వరలోనే రూపే డెబిట్ కార్డుల, యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఛార్జీలను వసూలు చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. దీనిని ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇదే జరిగితే యూపీఐ చెల్లింపులు కూడా ఉచితం కాదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

వాస్తవానికి ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులపై షాపు యజమానులు లేదా దుకాణదారులు మర్చంట్ డిస్కౌంట్ రేటును చెల్లిస్తున్నారు. వీసా, మాస్ట్రో వంటి కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ రేట్లు అమలులో ఉన్నాయి. అయితే 2022లో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా యూపీఐ చెల్లింపులతో పాటు రూపపే డెబిట్ కార్డు చెల్లింపులపై ఎలాంటి అదనపు రుసుములను వ్యాపారుల నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వసూలు చేయటం లేదు.
దేశంలోని డిజిటల్ పేమెంట్స్ సేవలను అందిస్తున్న అనేక సంస్థలు ఇటీవల రిజర్వు బ్యాంక్ గవర్నర్ కి వ్యాపారుల లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయాల్సిన ఆవస్యకతపై ప్రస్థావించారు. అయితే ఈసారి పెద్ద వ్యాపారులకు యూపీఐ లావాదేవీలపై MDRని తిరిగి విధించాలని బ్యాంకింగ్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను సమర్పించిందని సమాచారం. దీనికింద రూ.40 లక్షల వార్షిక జీఎస్టీ టర్నోవర్ కలిగిన వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని, దీనికంటే తక్కువ వ్యాపారం కలిగిన వ్యాపారులకు ఉచితంగా సేవలను అందించాలని కోరుతున్నట్లు వెల్లడైంది.
వాస్తవానికి పెద్ద వ్యాపారులు ఈ చిన్నపాటి రుసుమును చెల్లించగలరని వారు వాధిస్తున్నారు. ఎన్పీసీఐ సమాచారం ప్రకారం కేవలం ఫిబ్రవరి 2025లో భారతీయ ప్రజలు 16 బిలియన్ డిజిటల్ యూపీఐ లావాదేవీలను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 22 లక్షల కోట్లు విలువైన చెల్లింపులు నిర్వహించబడ్డాయి. అందువల్ల ప్రస్తుతం విదేశీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రూపే కార్డులపై కూడా ఇక నుంచి రుసుములు వసూలు చేయాలని బ్యాంకింగ్ సంస్థలు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications