Viral Video: ఇన్‌స్టాలో వైరల్‌గా ఇండియన్ వంటకం.. 24 క్యారెట్ల బంగారంతో..

Golden Dal: ధనవంతులు చేసే ప్రతి పనీ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం దేశం అంతా అంబానీ తనయుడి పెళ్లి విశేషాలను చూసి నోరెళ్లబెట్టే పనిలో ఉంది. అయితే ఇంతలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ ప్రజల అటెన్షన్ తనవైపుకి తిప్పుకునేందుకు ప్రయత్నించారు.

సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ గత ఏడాది దుబాయ్‌లో కష్కాన్ పేరిట తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన పలు ఆకర్షణీయ వంటకాలు మెనూలో ఉండేలా ప్లాన్ చేశారు. వీటిలో 24 క్యారెట్ల బంగారు 'తడ్కే వాలీ' దాల్ ఒకటి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 'దాల్ కష్కన్'గా పిలిచే ఈ వంటకం ధర 58 దిర్హామ్‌లు అంటే మన కరెన్సీలో దాదాపు 1,300.

Indian golden dal went viral in social media

ఫుడ్ వ్లాగర్ మెహుల్ హింగు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వంటకం వీడియోను షేర్ చేశాడు. గిన్నెలోని బంగారు మిశ్రమాన్ని చూపించడంతో వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం దానిని పప్పులో కలుపుతాడు. దీనిని పలు దేశాలలో ప్రఖ్యాతి గాంచిన సుగంధ ద్రవ్యాలు మరియు నెయ్యితో తయారుచేసినట్లు తెలుస్తోంది.

'దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్‌లో రణవీర్ బ్రార్‌కు చెందిన కష్కాన్‌లోని 24 క్యారెట్ల గోల్డెన్ తడ్కే వాలీ దాల్' అంటూ హింగు తన వీడియోకు క్యాప్షన్ జతచేశాడు. దీనిని ఇప్పటికే 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో వినియోగదారులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+