మార్చిలో అమాంతం 677 శాతం పెరిగిన భారత బంగారం దిగుమతి.. ఆ కారణాల వల్లే అంత డిమాండ్..
బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రపంచం మెుత్తానికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏడాది మే నెలలో భారత్ బంగారం దిగుమతులు ఒక సంవత్సరం క్రితం కంటే 677 శాతం పెరిగి ఒక ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీనివెనుక కీలకమైన పండుగలు, వివాహ సీజన్‌కు ముందు ధరల్లో మార్పు రిటైల్ ఆభరణాల కొనుగోళ్ల పెరుగుదలకు కారణంగా నిలిచాయని ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బులియన్ వినియోగదారుగా ఉన్న భారత్ బంగారం దిగుమతులను పెంచుకోవటం బెంచ్‌మార్క్ బంగారం ధరలకు మద్దతు నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ పెరుగుదల భారతదేశానికి వాణిజ్య లోటును పెంచుతుందని వారు అంభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు డాలర్ తో క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువపై ఇది మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.

ఒక్క నెలలోనే 100 టన్నులకు పైగా:
మనదేశం కేవలం మే నెలలోనే ఏకంగా 101 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో బంగారం దిగుమతులు కేవలం 13 టన్నులుగా ఉందని తెలుస్తోంది. విలువ పరంగా, మే దిగుమతులు ఏడాది క్రితం వెచ్చించిన 678 మిలియన్ డాలర్ల నుంచి 5.83 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలుస్తోంది. ఇదే సమయంలో దేశంలోని రిటైల్ వినియోగదారులు ధరల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ధరలు మారటం బంగారం ప్రియులు నగల దుకాణాలకు వెళ్లేందుకు దోహదం చేసినట్లు కోల్‌కతాలోని టోకు వ్యాపారి JJ గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మీరా అన్నారు.

డిమాండ్ కు కారణం ఆ పండగలే:
మే మొదటి వారంలో జరుపుకునే హిందువులు, జైనుల పండుగ సందర్భంగా బంగారం కొనడాన్నిఅనేక మంది శుభప్రదంగా పరిగణిస్తారు.స్థానిక బంగారం ఫ్యూచర్లు మే నెలలో 10 గ్రాములకు 49,572 రూపాయలకు పడిపోయాయి. ఇది దాదాపు మూడు నెలల కనిష్ఠ స్థాయి.కరోనా ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి విధించిన ఆంక్షల కారణంగా గత సంవత్సరం నుంచి చాలా వివాహాలు 2022కి వాయిదా వేయబడినందున పెళ్లిళ్ల సీజన్ కారణంగా గత నెలలో బంగారం డిమాండ్ మెరుగుపడిందని ముంబైకి చెందిన ప్రైవేట్ బులియన్ దిగుమతి బ్యాంకు డీలర్ ఒకరు తెలిపారు.

వివాహాల్లో వినియోగం:
భారత సాంప్రదాయంలో వధువు కట్నంలో బంగారం అనేది ఒక ముఖ్యమైన భాగమని చెప్పుకోవాలి. వివాహాల్లో కుటుంబ సభ్యులు, అతిథులు అందించే బహుమతుల్లో బంగారం కూడా చాలా కీలకమైనది.ఇటీవలి కాలంలో ధరలు పుంజుకోవడం, డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో జూన్‌లో భారత్ బంగారం దిగుమతులు 60 టన్నుల దిగువకు పడిపోవచ్చని డీలర్ తెలిపారు.


Click it and Unblock the Notifications