Gold Rate: శుభవార్త.. శనివారం గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది.. వీకెండ్ షాపింగ్ ముందు తాజా రేట్లివే..
Gold Price Today: దేశీయంగా పసిడి ధరలు వారాంతంలో మళ్లీ తగ్గటంతో చాలా మంది భారతీయులు సంతోషంలో ఉన్నారు. కార్తీకమాసంలో చాలా మంది పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేపడుతుంటారు. వరుసగా ఈ వారంలో దాదాపు 5 రోజుల పాటు గోల్డ్ రేట్లు తగ్గాయి. ట్రంప్ గెయిన తర్వాత మళ్లీ ద్రవ్యోల్బణం కారణంగా రేట్లలో ఫెడ్ తగ్గువ తగ్గింపులకు వెళుతుందనే అంచనాల మధ్య పసిడి ధరలు పతనం అవుతున్నాయి. అయితే షాపింగ్ చేయటానికి ముందు నేడు తగ్గిన రేట్లను తప్పక పరిశీలించాల్సిందే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6935, ముంబైలో రూ.6935, దిల్లీలో రూ.6950, కలకత్తాలో రూ.6935, బెంగళూరులో రూ.6935, హైదరాబాదులో రూ.6935, కేరళలో రూ.6935, వడోదరలో రూ.6940, అహ్మదాబాదులో రూ.6940, జైపూరులో రూ.7059, లక్నోలో రూ.7095, కోయంబత్తూరులో రూ.7044, మంగళూరులో రూ.6935, నాశిక్ లో రూ.6935, అయోధ్యలో రూ.6950, బళ్లారిలో రూ.6935, గురుగ్రాములో రూ.6950, నోయిడాలో రూ.6950 వద్ద కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయ ధరలు జీఎస్టీ, మజూరి, తరుగు, షాపు యజమానుల లాభాలు వంటివి కలపక ముందు రేట్లని గుర్తుంచుకోవాలి.

ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో 100 గ్రాములకు 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే రూ.1100 తగ్గుదలను చూసింది. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో తగ్గిన నేటి ధరలను వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7565, ముంబైలో రూ.7565, దిల్లీలో రూ.7580, కలకత్తాలో రూ.న, బెంగళూరులో రూ.7565, హైదరాబాదులో రూ.7565, కేరళలో రూ.7565, వడోదరలో రూ.7570, అహ్మదాబాదులో రూ.7570, జైపూరులో రూ.7699, లక్నోలో రూ.7699, కోయంబత్తూరులో రూ.7684, మంగళూరులో రూ.7565, నాశిక్ లో రూ.7568, అయోధ్యలో రూ.7580, బళ్లారిలో రూ.7565, గురుగ్రాములో రూ.7580, నోయిడాలో రూ.7580గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 తగ్గి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications