For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato: కొంపలు కూల్చుతున్న జొమాటో.. నమ్మి దగాపడ్డ ఇన్వెస్టర్లు.. అందుకే 14 శాతం క్రాష్..

|

Zomato Share: జొమాటో స్టాక్ విషయంలో గత వారం అందరూ ఊహించినదే ఈ రోజు జరిగింది. 2021 లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు, ఉద్యోగులు, ఇతర పెట్టుబడిదారులకు ఒక సంవత్సరం లాక్-ఇన్ పీరియడ్ ముగియడంతో ఫుడ్ డెలివరీ కంపెనీ స్టాక్ నేల చూపులు చూసింది. సోమవారం రికార్డు స్థాయిలో 14.3% నష్టపోయి ఇన్వెస్టర్లకు కన్నీటిని మిగిల్చించింది. జనవరి 24 నుంచి ఇది అతిపెద్ద ఇంట్రాడే నష్టంగా నిలిచింది.

60 శాతం పతనం..

60 శాతం పతనం..

జొమాటో జూలై 23, 2021న ముంబై స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేసింది. అయితే వాల్యుయేషన్‌ల గురించి ఆందోళనలు, గ్లోబల్ గ్రోత్ స్టాక్స్ క్రేటేడ్ కావడంతో అప్పటి నుంచి దాని షేర్లు తన విలువలో 60% కంటే ఎక్కువే కోల్పోయింది. ప్రస్తుతం గడువు ముగియటంతో.. ప్రమోటర్లు, ఉద్యోగులు సైతం దీనిని వదిలించుకుంటున్నారు. దీనిపై పెట్టుబడిదారులు ఆందోశళన వ్యక్తం చేస్తున్నారని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అన్నారు.

 బ్లింకిట్ కొనుగోలు నిర్ణయం..

బ్లింకిట్ కొనుగోలు నిర్ణయం..

ఇన్వెస్టర్లు కూడా బ్లింకిట్ కొనుగోలుపై సానుకూలంగా లేరని, కంపెనీ ఫండమెంటల్స్ ఇంకా బాగానే ఉన్నాయని ప్రశాంత్ తాప్సే అన్నారు. జూన్‌లో స్థానిక కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ తన ఒప్పందాన్ని ప్రకటించినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టాక్ 30 శాతానికి పైగా నష్టపోయింది. స్విగ్గీ, రిలయన్స్ ఇండస్ట్రీస్-మద్దతుగల డన్జో, టాటా-మద్దతుగల బిగ్‌బాస్కెట్, జెప్టోలతో పోటీ పడటానికి మరింత నిధులు అవసరమని నిపుణులు అంటున్నారు.

కంపెనీ మార్కెట్ క్యాప్..

కంపెనీ మార్కెట్ క్యాప్..

కంపెనీ ఇప్పుడు మార్కెట్ విలువ రూ.36,600 కోట్లు అంటే 4.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం నవంబర్‌లో దాని మార్కెట్ క్యాప్ ఆల్‌టైమ్ గరిష్ఠమైన రూ.1.29 లక్షల కోట్లుగా ఉంది.

మరో వారంలో ఫలితాలు..

మరో వారంలో ఫలితాలు..

Zomato తన మొదటి త్రైమాసిక ఫలితాలను ఆగస్టు 1న నివేదించనుంది. కంపెనీ మే నెలలో నాల్గవ త్రైమాసిక ఆదాయంలో 75% వృద్ధిని నమోదు చేసింది. అయితే స్థూల ఆర్డర్ విలువ - లేదా దాని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని ఫుడ్ డెలివరీ ఆర్డర్‌ల మొత్తం విలువ సంవత్సరానికి 77% పెరిగి రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరుకుంది. మరో పక్క కమిషన్ల కారణంగా Domino's పిజ్జా ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి తప్పుకోవాలని చూడటం ఆదాయంపై ప్రభావం చూపవచ్చు.

English summary

Zomato: కొంపలు కూల్చుతున్న జొమాటో.. నమ్మి దగాపడ్డ ఇన్వెస్టర్లు.. అందుకే 14 శాతం క్రాష్.. | indian food delivery company zomato stock lost 14 percent in intraday trading amid heavy selling after lock in period ends

indian food delivery company zomato stock lost 14 percent in intraday trading
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X