Indian Debts: గత ఏడాదితో పోలిస్తే భారత విదేశీ అప్పుల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాలు రుణ సమస్యల నుంచి గొప్పగా రికవరీ అవుతుండగా, వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత క్రెడిట్ నివేదికపై డేటా విడుదలైంది. ఇది భారత్‌కు హెచ్చరికగా మారింది.

భారత అప్పులు..
ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారత విదేశీ లోన్స్ నిష్పత్తి 8.2% పెరిగి 620.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ ను వెనక్కు నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

GDPలో అప్పుల శాతం..
గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో భారత అప్పులు 573.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మార్చి 2021 చివరి నాటికి 21.2% ఉన్న GDPలో రుణ నిష్పత్తి మార్చి 2022లో 19.9%కి తగ్గింది. అదే విదేశీ మారకపు నిల్వ నిష్పత్తిలో విదేశీ రుణం మునుపటి సంవత్సరంలో 100.6% నుంచి మార్చి 2022లో 97.85%కి తగ్గింది. భారత దీర్ఘకాలిక రుణం 499.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మొత్తం రుణంలో 80.4%. అదే స్వల్పకాలిక లోన్స్ 121.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 19.6% వాటాను కలిగి ఉంది.

అప్పు అంటే ఏమిటి?
మొత్తం విదేశీ రుణాల్లో ఎక్కువ భాగం వాణిజ్య రుణంగా ఉన్నాయి. ఇది దాదాపు 90%గా ఉంది. వీటిలో విదేశీ భారతీయుల డిపాజిట్లు, స్వల్పకాలిక వాణిజ్య రుణాలు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా దేశ సావరిన్ రుణ నిష్పత్తి 17.1% పెరిగి 130.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ని అదనంగా కేటాయించడం వల్ల ఇది ఈ మేరకు పెరిగింది.

NRI డిపాజిట్లు..
అదే నాన్-సార్వభౌమ రుణ నిష్పత్తి మార్చి 2021 నుంచి 490 బిలియన్ డాలర్లు అంటే 6.1% పెరిగింది. NRI డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాలను కూడా కలిగి ఉంటుంది. NRI డిపాజిట్లు 2% క్షీణించి 139 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సంబంధిత వాణిజ్య క్రెడిట్ నిష్పత్తి 209.71 బిలియన్ డాలర్లకు పెరిగింది. స్వల్పకాలిక వాణిజ్య క్రెడిట్ 117.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. వీటికి తోడు చెల్లింపు అవసరాల కోసం అవసరమైన ఫారెక్స్ నిల్వలు తగ్గటం కొంత ఆందోళనను కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications