Friday crash: రూ.8 లక్షల కోట్లు మింగేసిన మార్కెట్ క్రాష్.. ఇకపై మార్కెట్ల దారెటు..?

Market Closing: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లు వారాంతం ట్రేడింగ్ రోజున ఒక్కరోజే ఏకంగా రూ.8 లక్షల కోట్లు నష్టాన్ని చవిచూశారు.

వాస్తవానికి ఐటీ కంపెనీలు ఉత్తమ పనితీరు కనబరిచిన వేళ బడ్జెట్ సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అయితే ఇప్పటికీ బ్రోకరేజ్ సంస్థలు మార్కెట్లపై తమ సానుకూలతను కొనసాగిస్తూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో కరెక్షన్ల మధ్య శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి సెన్సెక్స్ సూచీ 739 పాయింట్ల నష్టంతో 80,604 వద్ద, నిఫ్టీ సూచీ 270 పాయింట్లు నష్టపోయి 24,530 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,587, నిఫ్టీ 24,854 పాయింట్లను తాకి ఉదయం ఆల్-టైమ్ గరిష్టాలకు చేరాయి.

Indian equity investors wealth eroded by 8 lakh crores amid profit booking on Friday

ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1092 పాయింట్లు, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1194 పాయింట్ల భారీ నష్టాన్ని నేడు చూశాయి. గురువారం సెషన్‌లో ముగింపు నాటికి బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ రూ.454.32 లక్షల కోట్ల ఉండగా.. అది శుక్రవారం సాయంత్రం మార్కెట్ల ముగింపు సమయానికి రూ.446.38 లక్షల కోట్లకు తగ్గడంతో ఇన్వెస్టర్ల సంపద ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.7.94 లక్షల కోట్లు క్షీణించింది. అయితే క్యూ1 ఫలితాల్లో ఐటీ కంపెనీల ఉత్తమ పనితీరు కారణంగా ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తమ లాభాల పరంపరను నేడు కొనసాగించాయి.

అయితే మార్కెట్ల ముగింపు నాటికి టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు 5.17% వరకు పడిపోయి సెన్సెక్స్ సూచీలో టాప్ లూజర్లుగా నిలిచాయి. నేడు మార్కెట్లపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా డివైజ్‌లు క్రాష్ కావడానికి కారణమైన ఆపరేటింగ్ సిస్టమ్ సమస్యల కారణంగా, గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా దేశీయ మార్కెట్ తిరోగమనంతో ముగిసిందన్నారు. అలాగే రానున్న వారంలో కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈక్విటీ మార్కెట్లు నేడు లాభాల బుకింగ్‌ను చూశాయని అన్నారు. బీఎస్ఈలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు వరుసగా 1469 పాయింట్లు, 1346 పాయింట్లు, 1166 పాయింట్లు మరియు 1350 పాయింట్లు నష్టపోయాయి.

యూఎస్-చైనా మధ్య మళ్లీ మెుదలైన ట్రేడ్ వార్ పై నిరంతర ఆందోళనల మధ్య శుక్రవారం ఆసియా మార్కెట్లలోని సూచీలు క్షీణించాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక బలహీనత సంకేతాలు వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ ఆశావాదాన్ని అధిగమించాయని అన్నారు. నిఫ్టీ మునుపటి సెషన్‌లోని లాభాలను వదిలివేస్తూ రోజువారీ చార్టులలో బేర్ ప్యాటర్న్‌ను రూపొందించిందని జసాని పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం నికర ప్రాతిపదికన రూ.5,483.63 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,904 కోట్ల షేర్లను కొనుగోళ్లు చేపట్టారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+