మెటాలో 6 కోట్ల జాబ్ వదులుకున్న ఇండియన్ టెక్కీ.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..
ఒకరి కింద ఉద్యోగం చేసేందుకు ఈమధ్య యువత ఆసక్తి చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ.. సొంతంగా బిజినెస్ లేదా స్టార్టప్ లు మొదలుపెట్టేందుకు చూస్తున్నారు. దీనికోసం కోట్లాది రూపాయల ప్యాకేజీలను సైతం వదులుకోవడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.
సొంత స్టార్టప్ ప్రారంభించేందుకు భారతీయ ఇంజనీర్ రాహుల్ పాండే.. సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాలో ఉద్యోగం వదులుకున్నాడు. ఏకంగా 6 కోట్ల ప్యాకేజీని కాదనుకున్నాడు. ఇంజినీరింగ్ కమ్యూనిటీకి సహాయం చేసే లక్ష్యంతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించాడు.

రాహుల్ తన జర్నీని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశాడు. ఫేస్ బుక్ లో చేరిన మొదటి 6 నెలల్లో తీవ్ర ఆందోళన అనుభవించినట్లు చెప్పాడు. సీనియర్ ఇంజనీర్‌గా ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో పోరాడినట్లు తెలిపాడు. కంపెనీ సంస్కృతి మరియు సాధనాలకు అనుగుణంగా మారడం సవాలుగా అనిపించినట్లు వెల్లడించాడు.
ఇక చివరగా మెటా నుంచి రాజీనామా చేశాడు. అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల కెరీర్‌లను అభివృద్ధి చేయడానికి సహాయపడే లక్ష్యంతో 'టారో' అనే సొంత స్టార్టప్‌ను ప్రారంభించాడు. అయితే ఇంజనీర్లందరూ స్టార్టప్‌ను ప్రారంభించకూడదు కానీ వారిలో కొందరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని గతంలో అభిప్రాయపడ్డాడు. సరైన వ్యక్తి ఆరంభిస్తే మాత్రం దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నాడు.


Click it and Unblock the Notifications


