IPO News: ఐపీవో మెుదటి రోజే మూడింతలు లాభం.. బంపర్ లిస్టింగ్‌తో బ్యాంగ్..

Indian Emulsifier IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన ఐపీవో ఎవ్వరూ ఊహించని స్థాయిలో రాబడులను అందించింది. ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసిన వారిపై ధనలక్ష్మి కనకవర్షం కురిపించింది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఇండియన్ ఎమల్సిఫైయర్ ఐపీవో షేర్ల గురించే. ఐపీవో షేర్లు మార్కెట్లోకి రాగానే సంచలనం సృష్టించాయి. లిస్టింగ్ సమయంలో ప్రీమియం రేటుకు షేర్లు జాబితా కావటంతో మూడు రెట్లు రాబడిని ఇన్వెస్టర్లు అందుకున్నారు. మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ సమయంలో ఇండియన్ ఎమల్సిఫైయర్ షేర్లు 225 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో ఒక్కో షేరు రూ.430 వద్ద బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ సమయంలో ఒక్కో షేరును ఒక్కోటి రూ.132 రేటు వద్ద విక్రయించిన సంగతి తెలిసిందే.

Indian Emulsifier IPO made bumper listing today with 225 premium Investors gained heavily

ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మే 13న ప్రారంభమై మే 16న ముగిసిన సంగతి తెలిసిందే. నేడు మార్కెట్లోకి కంపెనీ షేర్లు బలమైన లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ క్రమంలో ఐపీవో షేర్ల ధర 4 శాతానికి పైగా పడిపోయి ఒక్కోటి రూ.410.05కి చేరుకున్నాయి. గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు రూ.451 గరిష్ట స్థాయిని తాకాయి. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.42.39 కోట్లను విజయవంతంగా సమీకరించింది. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. వాస్తానికి ఐపీవోకి ముందర కంపెనీలో ప్రమోటర్ల వాటా 65.25 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 48.11 శాతానికి తగ్గింది. 2020లో స్థాపించబడిన కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ, సరఫరా వ్యాపారంలో ఉంది.

ఇండియన్ ఎమల్సిఫైయర్ ఐపీవో మొత్తం 460.07 సార్లు సభ్యత్వం పొందింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 484.66 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో వాటాలు 779.63 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 175.95 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైప్షన్ పొందాయి. కంపెనీ తన ఐపీవో కోసం లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించింది. దీనికోసం ఇన్వెస్టర్లు కనీసం లాట్ కోసం దరఖాస్తు చేయటానికి రూ.1,32,000 ఇన్వెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+