మోడీ హయాంలో జీడీపీ.. ఆరేళ్లలో ఇలా పెరుగుతూ, పడిపోయింది
గత పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులు చూస్తోంది. ప్రస్తుతం ఈ దశాబ్దం మొదటి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్నారు. 2008 నుంచి ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉంది. ఆహార ద్రవ్యోల్భణం ఆరేళ్ల గరిష్టానికి, రెవెన్యూ కలెక్షన్ వృద్ధి దశాబ్ద కనిష్టానికి చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నెట్ ట్యాక్స్ కలెక్షన్లు 25 శాతం పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా నవంబర్ నాటికి పన్ను ఆదాయం 2.6 శాతం మాత్రమే పెరిగింది.
బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు

వృద్ధి రేటు 5 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలల్లో ట్యాక్స్ వసూళ్లు సాధించినప్పటికీ కొరతను పూడ్చేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే జీడీపీ 9 శాతం లేదా 10 శాతం ఉండాలి. గత దశాబ్దం తర్వాత వృద్ధి రేటు 5 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇది ఆందోళన కలిగించే అంశం.

తగ్గించిన ఐఎంఎఫ్
2019-20లో భారత వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కానీ ఇప్పుడు 4.8 శాతానికి సవరించింది. ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటుండగా.. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ఆర్థిక మందగమనానికి అంతర్జాతీయ పరిణామాలకు తోడు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు కూడా తోడయ్యాయనేది ఆర్థిక నిపుణుల మాట. 2014 నుంచి 2019 మధ్య జీడీపీ, ద్రవ్యలోటు నెంబర్స్ ఇలా ఉన్నాయి....

ద్రవ్యలోటు
2014 ఆర్థిక సంవత్సరం - 4.5%
2015 ఆర్థిక సంవత్సరం - 4.1%
2016 ఆర్థిక సంవత్సరం - 3.9%
2017 ఆర్థిక సంవత్సరం - 3.5%
2018 ఆర్థిక సంవత్సరం - 3.2%
2019 ఆర్థిక సంవత్సరం (అంచనా) - 3.3%

CPI ద్రవ్యోల్భణం
2019 - 7.49%
2018 - 4.85%
2017 - 4.2%
2016 - 4.97%
2015 - 5.88%
2014 - 6.37%

వార్షిక జీడీపీ వృద్ధి
2020 (అంచనా) - 5%
2019 - 5%
2018 - 6.8%
2017 - 7.1%
2016 - 8.2%
2015 - 8.0%
2014 - 7.41%


Click it and Unblock the Notifications