Stock Market: మోదీ 3.0 కేంద్రంలో పరిపాలన మెుదలుపెట్టి కొద్ది రోజులు అవుతోంది. అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ రెండు ప్రతికూలతలతో పోరాడుతున్న సంచలన నివేదికల ద్వారా వెల్లడైంది. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇది పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి.
వాస్తవానికి ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్ కావటానికి ప్రైవేటు పెట్టుబడులు చాలా కీలకమైనవి. అయితే నిజానికి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇండియన్ ఎకానమీ పెడ్డుబడుల తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. మెుదటి త్రైమాసికంలో ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టుల విలువ 92% క్షీణించి రూ.59,900 కోట్లకు పడిపోయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2009 తర్వాత ప్రైవేటు పెట్టుబడులు ప్రస్తుతం అత్యల్ప స్థాయిలకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడి సెంటిమెంట్ తక్కువగా ఉండటతో పాటు కొన్ని రంగాల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ కేంద్రీకృతమై ఉన్నాయి.

FY25లో ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నప్పటికీ, మొత్తం పెట్టుబడి కార్యకలాపాలు గతంలో లాగా ప్రభుత్వ పెట్టుబడులపై ఆధారపడి ఉండవచ్చని తెలుస్తోంది. పెట్టుబడిదారులకు భారతదేశం కూడా లాభదాయకమైన మార్కెట్‌లలో ఒకటిగా ఉంది. అయితే కంపెనీలు రిస్క్ తీసుకునే మూడ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. బహుశా ప్రైవేట్ వినియోగం సింగిల్ డిజిట్‌లో పెరగడం వల్ల కావచ్చు. ప్రత్యేకించి గ్రామీణ డిమాండ్ అవసరమైన వేగాన్ని అందుకోలేదు. అయితే పట్టణాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. FY23లో పెట్టుబడులు GDPలో 10.9%గా ఉండగా.. FY08లో 16.8% గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంది.
అలాగే రెండో చేదు వార్తను పరిశీలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ 7% వేగంతో వృద్ధి చెందినప్పటికీ.. వచ్చే దశాబ్దంలో ఇండియాలో పెరుగుతున్న శ్రామికశక్తికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి భారత్ కష్టపడుతుందని సిటీ గ్రూప్ పేర్కొంది. ఇది నిరుద్యోగిత పెరుగుదలను సూచిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఉపాధి, నైపుణ్యాలను పెంచడానికి మరింత సమిష్టి చర్యలు అవసరమని సిటీ గ్రూప్ సూచించింది.
లేబర్ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్యను స్వీకరించడానికి భారతదేశం వచ్చే దశాబ్దంలో సంవత్సరానికి సుమారు 12 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందని సిటీ అంచనా వేసింది. అలాగే దేశంలో సృష్టించబడుతున్న ఉద్యోగాల నాణ్యత మరొక సవాలుగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు తక్కువ మంది వ్యక్తులు అధికారిక రంగంలో ఉపాధి పొందుతున్నారని వెల్లడైంది. ఈ ప్రతికూలతలు భారతీయ స్టాక్ మార్కెట్లపై, మార్కెట్ పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications