Flipkart News: దేశీయ ఈ-కామర్స్ స్టార్టప్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. అమెజాన్, మీషో లాంటి ఇతర పోటీదారులను ధీటుగా ఎదుర్కొనేందుకు తాజాగా పెట్టుబడిని పొందింది.
ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్ కంటే దాదాపు 5-10% అధిక విలువతో 600 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. కంపెనీ స్టార్టప్ ఫండింగ్ కింద మాతృసంస్థ వాల్‌మార్ట్ నుంచి భారత కరెన్సీ ప్రకారం రూ.5,000 కోట్ల నిధులను సేకరించినట్లు వెల్లడించింది. వాస్తవ గణాంకాలను వెల్లడించకుండానే ఈ మొత్తం 5-10 శాతం శ్రేణిలో అధిక వాల్యుయేషన్‌కు వచ్చిందని వర్గాలు తెలిపాయి.

ఫ్లిప్‌కార్ట్ తన మాతృ సంస్థ నుంచి ఇటీవలి నిధుల సేకరణ తర్వాత కంపెనీ వాల్యుయేషన్‌పై వ్యాఖ్యానించలేదు. ఫ్లిప్‌కార్ట్ చివరిగా 37.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.2.79 లక్షల కోట్ల విలువైనదిగా వెల్లడించబడింది. ఆ సమయంలో కంపెనీ 3.6 బిలియన్ డాలర్లు అంటే GIC, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, వాల్‌మార్ట్, డిస్‌రప్ట్‌ఏడీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, టైగర్ గ్లోబల్ నుంచి దాదాపు రూ.26,800 కోట్లను మూలధన అవసరాల కోసం సేకరించింది.
కంపెనీ వాల్యుయేషన్ ఇప్పటికీ 40 బిలియన్ డాలర్ల కంటే తక్కువగానే ఉందని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర ఆదాయం 9.4 శాతం వృద్ధితో రూ.56,012.8 కోట్లుగా నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.51,176 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం పెరిగినప్పటికీ.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ ఏకీకృత నష్టం రూ.4,890.6 కోట్లకు పెరిగటం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇది అంతకుముందు ఏడాది కాలంలో రూ.3,371.2 కోట్లుగా ఉంది.
తాజాగా ఈకామర్స్ దిగ్గజం పొందుతున్న మూలధనం దేశంలో ఫ్లిప్‌కార్ట్ తన పరిధిని మరింతగా పెంచుకోవడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను రెట్టింపు చేయడానికి సహాయపడుతుందని సమాచారం. టైగర్ గ్లోబల్, ఎక్సెల్, వాల్‌మార్ట్ వంటి ప్రారంభ పెట్టుబడిదారుల నిష్క్రమణ తర్వాత ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 80.5% వాటాను వాల్‌మార్ట్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications