Defence news: స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి భారత రక్షణ రంగంలో కీలక మార్పులు జరిగాయి. అంతర్గత కలహాల నుంచి బాహ్య దేశాల బెదిరింపులకు ఎదురొడ్డి నిలిచేలా గణనీయమైన వృద్ధిని సాధించాం. 1950ల నాటి నుంచే ఇరుగుపొరుగుదేశాలు ఇండియాను అంతం చేయాలని చూసినా నమ్మకమైన మిత్ర దేశం రష్యా ఎప్పటికప్పుడు స్నేహ హస్తం అందిస్తూనే ఉంది. ప్రపంచమంతా మనల్ని దూరం పెడుతున్నా, తన టెక్నాలజీని మనతో పంచుకుని డిఫెన్స్ సెక్టార్‌లో ఎదిగేందుకు భారత్‌కు చేదోడువాదోడుగా నిలిచింది.
రక్షణ సామాగ్రి విషయంలో గతంలో పూర్తిగా కొనుగోళ్లపై ఆధారపడే ఇండియాను చూసి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. వివిధ అభివృద్ది చెందిన, రక్షణ రంగంలో ఎన్నో సాధించిన దేశాలు కూడా బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్షిపణిని చూసి కుళ్లుకుంటున్నాయి. ఇక దాని సత్తా లైవ్‌లో చూసిన పాకిస్థాన్‌కి అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అంతేకాకుండా బాలాకోట్ దాడుల అనంతరం 1950ల నాటి పాతతరం సోవియట్ మిగ్-21తో అధునాతన అమెరికా తయారీ F-16ని నేలకూల్చడంతో రక్షణ వ్యవస్థ, పరికరాల విషయంలో ఇండియా ఎంత అప్రమత్తంగా ఉంటుందో ప్రపంచానికి అర్థమైంది.

అంచెలంచెలుగా జాతీయ భద్రతను పెంపొందించడంలో భాగంగా రక్షణ బడ్జెట్‌ను కూడా భారత్ భారీగా పెంచుతూ వస్తోంది. ఇందులో భాగంగా 1940-70 మధ్య కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్, HAL, భారత్ డైనమిక్స్, మిధాని, BEML వంటి ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు బీజం వేసింది. ఇవే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన షిప్ బిల్డర్ మజగాన్ డాక్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌లను అధీనంలోకి తీసుకుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి పెద్దపీట వేస్తూ వస్తోంది. క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు మరియు మానవరహిత వైమానిక వాహనాలతో సహా అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటోంది.
2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా భారీ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేంద్రం ద్వారాలు తెరిచింది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, స్వయం విశ్వాస్ భారత్ మిషన్ వంటి సంస్కరణలు చేపట్టింది. ఆయుధాల దిగుమతులను తగ్గించుకుంటూ ఎగుమతుల దిశగా అడుగులు వేయాలని సంకల్పించి దాన్ని నిజం చేస్తోంది. ప్రభుత్వం తరఫున DRDO ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ మరియు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఇండియన్ నేవీ మరియు కోస్ట్ గార్డ్ కోసం యుద్ధ నౌకల నిర్మాణానికి బాధ్యత వహిస్తున్నాయి.
2001 వరకు రక్షణ రంగంలోకి ప్రవేశించకుండా ప్రైవేట్ సంస్థలపై నిషేధం ఉంది. అనంతర పరిణామాల తర్వాత 2022-23 నాటికి మొత్తం రక్షణ రంగ ఉత్పత్తుల్లో ప్రైవేట్ వాటా 20 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 2023 నాటికి ప్రభుత్వం 369 ప్రైవేట్ కంపెనీలకు 606 లైసెన్సులు జారీ చేసింది. టాటా గ్రూప్, లార్సెన్ & టూబ్రో (L&T), మహీంద్రా మరియు భారత్ ఫోర్జ్ వంటి భారతీయ గ్రూప్స్ రక్షణ ఉత్పత్తుల తయారీలో పాలుపంచుకుంటున్నాయి. ఇవే కాకుండా 14 వేల MSMEలు 329 స్టార్టప్స్ కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యాయి.
అయితే ఇంత జరుగుతన్నా 2019-23 మధ్య కాలంలో భారత్ 9.85 శాతంతో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉండటం బాధాకరం. ఈ చట్రం నుంచి బయట పడేందుకు ఇటీవల క్షిపణులు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, యుద్ధనౌకలు, రాడార్లు వంటి దాదాపు 500 రకాల యుద్ధ సామాగ్రి దిగుమతులను భారత్ నిషేధించింది. అంటే వాటి తయారీని స్వదేశంలోనే నిర్వహిస్తోందని అర్థం. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి స్వయంసమృద్ధి దేశంగా ఇండియా మారుతుందని ఆశిద్ధాం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications