బ్యాంకుల నిరాసక్తత, క్రిప్టో ఏజెన్సీల తడబాటు: పరిష్కారం కోసం అటు వైపు
బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు సంబంధాలు తెంచుకోవడం ప్రారంభించిన అనంతరం అవాంతరాలు లేని పరిష్కారం కోసం భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఈ ప్రభావం క్రిప్టో మార్కెట్ పైన ఉంటోంది. కరోనా తర్వాత దాదాపు ఏడాది పాటు క్రిప్టో మార్కెట్ పరుగులు పెట్టింది. బారతీయులు కూడా పెద్ద ఎత్తున క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్, బదలీలు, చెల్లింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తున్నాయి.

బ్యాంకులకు ఆర్బీఐ సూచన
క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌కు ప్రస్తుతం ఆర్బీఐ సుముఖంగా లేదు. ఇటీవల క్రిప్టో వ్యాల్యూ పడిపోవడంతో వాటి స్థిరత్వంపై కేంద్రీకరించాలని బ్యాంకర్లను ఆర్బీఐ కోరింది. వివిధ పేమెంట్ గేట్‌వే సంస్థలతో టై-అప్ అయిన బ్యాంకులు క్రిప్టో ట్రాన్సాక్షన్స్‌ను నిరాకరిస్తున్నాయి. దీంతో క్రిప్టో కస్టమర్ల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
'క్రిప్టోతో ట్రాన్సాక్షన్స్ వ్యాపారానికి బ్యాంకులు ఆసక్తిగా లేవు' అని జెబ్‌పే కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్ శేఖర్ అన్నారు. సమస్య పరిష్కారానికి తాము వివిధ పేమెంట్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని, కానీ ఇవి మందకోడిగా కొనసాగుతున్నాయన్నారు.

క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన ప్రతికూలం
డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ సుముఖంగా లేకపోవడంతో క్రిప్టో మార్కెట్ సమస్యలు ఎదుర్కొంటోంది. డిజిటల్ కరెన్సీ స్థిరత్వం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. భారత్‌లోని అన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలకు కస్టమర్ల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. ప్రధాన పేమెంట్ గేట్‌వే కంపెనీలు ముందుకు రాకపోవడంతో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.

ప్రత్యామ్నాయంగా...
స్మాల్ పేమెంట్ గేట్‌వేలతో భాగస్వామ్యానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు దేశంలోని పలు క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ ప్రతినిధులు చెబుతున్నారు. సొంత చెల్లింపు ప్రక్రియ నిర్మాణం, ఇన్‌స్టాంట్ సెటిల్మెంట్ పద్ధతులను అవలంభించనున్నాయి.


Click it and Unblock the Notifications