WazirX News: భారత ప్రభుత్వం చాలా కాలంగా క్రిప్టోలను అణచివేస్తోంది. క్రిప్టోల నియంత్రణకు ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. అలాగే దేశీయంగా ప్రజలను వీటికి దూరంగా ఉంచేందుకు భారీగా పన్నులు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయినా స్వల్ప కాలంలో ఎక్కువ రాబడిని పొందొచ్చనే ఆలోచనతో ఉన్న కొందరు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మాత్రం ఇప్పటికీ వీటిలో తమ పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాని దాని వాలెట్‌లలో ఒకదానిపై జరిగిన భద్రతా ఉల్లంఘన దీనికి కారణంగా కంపెనీ వెల్లడించింది. గురువారం ప్రారంభ యూరోపియన్ గంటలలో 230 మిలియన్ డాలర్లకు పైగా విత్‌డ్రాలు జరిగినట్లు కంపెనీ గుర్తించింది. వాస్తవానికి భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.1900 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటన కారణంగా వినియోగదారులకు చెందిన నిధులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై తమ బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోందని కంపెనీ వెల్లడించింది.

ఈ క్రమంలో ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి INR క్రిప్టో ఉపసంహరణలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని సహకరిస్తున్నందుకు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో వినియోగదారులకు ధన్యవాదాలు చెప్పింది. దీనిపై మరిన్ని అప్‌డేట్‌లతో పోస్ట్ చేస్తామని పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం అవుట్‌ఫ్లోలను పరిశీలిస్తోందని, అన్ని ఉపసంహరణలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. తాము మరో 2 దోపిడీకి గురైన స్మార్ట్ కాంట్రాక్టులను గుర్తించామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
మల్టీసిగ్ వాలెట్ అనేది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ వాలెట్. ఇది ప్రాసెస్ చేయడానికి ముందు లావాదేవీలను ప్రామాణీకరించడానికి, నిర్ధారించడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రైవేట్ కీలు అవసరం ఉంటుంది. Lookonchain ద్వారా ట్రాక్ చేయబడిన ప్రారంభ బ్లాక్‌చెయిన్ డేటా 100 మిలియన్ డాలర్లకు పైగా విలువైన షిబా ఇను టోకెన్‌లు ఉపసంహరణకు గురైనట్లు వెల్లడైంది. ఇది నిధుల్లో అతిపెద్ద నష్టాన్ని సూచిస్తోంది. దీని తర్వాత 52 మిలియన్ డాలర్లు విలువైన ఈథర్, 11 మిలియన్ డాలర్లు విలువైన మాటిక్స్, 6 మిలియన్ డాలర్లు విలువైన పెపే చోరీకి గురైనట్లు వెల్లడైంది. దోపిడీదారుడు దొంగిలించబడిన ఆస్తులను ఆన్-చైన్ ఎక్స్ఛేంజ్ యూనిస్వాప్‌లో చురుకుగా విక్రయిస్తున్నట్లు లావాదేవీ డేటా సూచిస్తుంది.
భారతీయ వ్యాపారుల్లో ప్రసిద్ధి చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirX ప్రధానంగా భారతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో నమోదు చేసుకున్న దేశంలోని కొన్ని ఎక్స్ఛేంజీలలో ఇది ఒకటి. ఈ నమోదు WazirX భారతీయ పౌరులకు క్రిప్టో మార్పిడి సేవలను అందించడానికి అనుమతిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications