యూనికార్న్ క్లబ్‌లోకి భారత క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్‌డీసీఎక్స్
భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ CoinDCX యూనికార్న్ క్లబ్‌లోకి ఎంటర్ అయింది. తాజా సిరీస్ C ఫండ్‌లో 90 మిలియన్ డాలర్లు లేదా రూ.668. కోట్లు సమీకరించడం ద్వారా ఈ జాబితాలోకి చేరింది. తాజా ఫండ్ రెయిజింగ్‌తో కాయిన్ డీసీఎక్స్ వ్యాల్యుయేషన్ 1.1 బిలియన్ డాలర్లు లేదా రూ.8150 కోట్లకు చేరుకుంది. ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లో యూనికార్న్ స్టేటస్ పొందిన మొదటి సంస్థగా నిలిచింది.
CoinDCX కోఫౌండర్ అండ్ సీఈవో సుమిత్ గుప్తా మాట్లాడుతూ... తాము వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని, క్రిప్టో ఇన్వెస్టర్ బేస్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ సహా వివిధ అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, క్రిప్టో కరెన్సీలు మళ్లీ పుంజుకుంటున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం, యూనీస్వాప్ దాదాపు పది శాతం మేర లాభపడ్డాయి. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ 45,000 డాలర్లను సమీపించింది. గత వారం రోజులుగా బిట్ కాయిన్ ఇరవై శాతం మేర ఎగిసిపడింది. ఓ సమయంలో 46,000 డాలర్లు కూడా దాటింది. అయితే నేటి సెషన్లో స్వల్పంగా క్షీణించినప్పటికీ 45వేల డాలర్ల సమీపంలో ఉంది. కేవలం బియాన్స్ కాయిన్ మాత్రమే క్షీణించింది. మిగతా క్రిప్టోలు లాభపడ్డాయి.
వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ... బిట్ కాయిన్ 45,648.78 డాలర్లు, ఎథేరియం 3,106.82 డాలర్లు, బియాన్స్ కాయిన్ 330.26 డాలర్లు, టెథేర్ 1.00 డాలర్లు, కార్డానో 1.46 డాలర్లు, డోజీకాయిన్ 0.25 డాలర్లు, ఎక్స్ఆర్పీ 0.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications