2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతీయ కార్పొరేట్ కంపెనీల లాభాలు 3.1 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు 31 శాతం పెరగగా, భారీగా క్షీణించడం నెలవారీ జీతభత్యాల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వాస్తవానికి కరోనా మహమ్మారి కాలం కాలం 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత ఇదే అత్యంత చెత్త మొదటి త్రైమాసిక ఫలితాలుగా వెల్లడైంది.
జూలై ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ త్రైమాసిక ఫలితాల ఆధారంగా పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 2,539 కంపెనీల త్రైమాసిక ఫలితాలను గణిస్తే మొత్తం విక్రయాలు రూ.22.9 లక్షల కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.21.7 లక్షల కోట్లుగా ఇది ఉన్నాయి. అలాగే మెుత్తం వ్యయాలు 6.4 శాతం పెరిగి రూ.19.6 లక్షల కోట్లకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక శాస్త్ర విభాగం నివేదిక ప్రకారం గత ఏడాది రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తగ్గింది.

ఈ సర్వేలో పాల్గొన్న 2,539 కంపెనీలు దాదాపు 33 రంగాలకు చెందినవి. దేశంలోని 18 రంగాలు సగటు అమ్మకాల వృద్ధి 7.7 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. గత ఏడాది కంటే 22 పరిశ్రమల ఆదాయం మెరుగుపడింది. సీజనల్ డిమాండ్ కారణంగా ముఖ్యంగా వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, రిటైల్ రంగాలు బలమైన అమ్మకాలను నమోదు చేశాయి. నికర లాభాన్ని పరిశీలిస్తే, దాదాపు 20 రంగాలు సగటున 3.5 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే క్రమంలో వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ సహా 15 రంగాలు మాత్రమే గతేడాది లాభాల వృద్ధిని అధిగమించాయి.
జాతీయ స్టాక్ మార్కెట్లో లిస్టయిన 50 కంపెనీల పన్ను తర్వాత లాభం 4 శాతం పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు మొత్తం పనితీరును ప్రభావితం చేశాయి. చమురు మేజర్లను మినహాయించి, నిఫ్టీ 50 కంపెనీలు 9 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. స్థిరమైన వడ్డీ రేట్లు తక్కువ ఉత్పత్తి ఖర్చులు ఉన్నప్పటికీ, భారతీయ కంపెనీల లాభాల వృద్ధి మందగించడం పెట్టుబడిదారులను కలవరపెట్టింది. బలహీనమైన పనితీరు మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉండటం ఈ పరిస్థితికి అంతర్లీన కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications