పయనీరింగ్ ఇంటర్నేషనల్ ప్రొవైడర్ ఆఫ్ లోకల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ PPRO, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గ్లోబల్ అలయెన్స్ NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్(PSPs) వంటి PPRO ఇంటర్నేషనల్ కస్టమర్లు ప్రయోజనం పొందుతారు. అలాగే రూపే కార్డ్, యూపీఐ మద్దతును విస్తరించడం లక్ష్యంగా చేసుకున్నవారు ప్రయోజనం పొందుతారు. ఈ ఒప్పందం NIPL కొత్త ప్రాంతాలకు విస్తరించడం కోసం సహాయపడుతుంది. అలాగే PPRO లోకల్ పేమెంట్ మెథడ్(LPM) సర్వీస్ రీజియన్‌ను భారత్ సహా పలు ప్రాంతాలకు విస్తరించడానికి ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉండగా, పెద్దనోట్ల రద్దు తర్వాత గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో క్రమబద్ధీకరణ పెరుగుతోంది. నగదు చెలామణీ కూడా అదే విధంగా పెరుగుతూ ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలోని 80 శాతం వరకు నగదేతర విభాగాలను క్రమబద్ధీకరించారు. ఇపుడు నగదు చెలామణీ గరిష్ఠస్థాయికి సమీపించింది. కరోనా పరిణామాలు కూడా నగదు ట్రాన్సాక్షన్స్ అధికమయ్యేందుకు కారణమయ్యాయి. ఏ వస్తువును తాకకుండానే మొబైల్ ద్వారా జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2017తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగినా, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ మాత్రం తగ్గాయి.

నోట్ల రద్దు అనంతరం నగదు చెలామణీ జీడీపీ విలువలో 8.7 శాతానికి తగ్గింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇది 13.1 శాతంగా నమోదయింది. 2020-21లో కరోనా పరిణామాల్లో ఇది 14.5 శాతంగా ఉంది. హాస్పిటల్ ఖర్చులు, ఇతర అత్యవసరాల కోసం ఎక్కువమంది నగదును అట్టి పెట్టుకుంటున్నారు. 2007-08 నుండి 2009-10 వరకు ఆర్థిక వ్యవస్థ రాణించిన సమయంలో నగదు చలామణి వరుసగా 12.1 శాతం, 12.5%, 12.4 శాతంగా నమోదయింది. ఆ తర్వాత అయిదేళ్ల వరకు ఇదే ధోరణి కొనసాగింది. 2020-21లో 14.5 శాతం వద్ద గరిష్ఠస్థాయిని చేరుకుంది. ప్రజలు ముందు జాగ్రత్తగా రూ.3.3 లక్షల కోట్లను నగదు రూపంలో అట్టిపెట్టుకోవడం ఇందుకు కారణం. ఆ సమయంలో జీడీపీ 7.3 శాతం క్షీణించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications