IT News: భారత టెక్ రంగంలో భూకంపం.. టెక్కీలను పీకేసిన దిగ్గజ కంపెనీ.. షాక్
IT News: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు మరోసారి లేఆఫ్‌లను ప్రకటిస్తుండగా.. ఈ సారి భారతీయ కంపెనీల వంతు వచ్చేసింది. ఈ క్రమంలో దేశీయ ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగుల తొలగింపు గురించి సడెన్ ప్రకటన విడుదల చేసింది.
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ మరియు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టి గ్రూప్‌లోని.. L&T టెక్నాలజీ దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన 200 మంది ఉద్యోగులు మధ్య, సీనియర్ స్థానాల్లో ఉన్నవారేనని వెల్లడైంది. కంపెనీ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహించింది. రోల్ ఓవర్‌లాప్‌ల సమస్యను పరిష్కరించే క్రమంలో తాజా చర్య వచ్చినట్లు తేలింది.

వాస్తవానికి L&T గ్రూప్‌లో రెండు టెక్ విభాగాలు ఉన్నాయి. మెుదటిది ఇంజనీరింగ్ విభాగానికి సాంకేతిక సేవలను అందించే L&T టెక్నాలజీ కంపెనీ. ఇది ఇంజనీరింగ్, తయారీ, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలకు డిజైన్, సాంకేతిక సేవలను అందిస్తుంది. అలాగే కంపెనీలోని రెండవ భాగం L&T ఇన్ఫర్మేషన్ టెక్. కంపెనీ 2019లో మైండ్‌ట్రీ నిర్వహణను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత 2022లో మొత్తంగా LTIMindtreeగా మారింది. ఇందులో ఎల్ అండ్ టీ టెక్నాలజీ లేఆఫ్ ప్రకటించింది.
ఇప్పటికే ఐటీ సర్వీసుల రంగం కుదేలవుతున్న తరుణంలో.. ఏ కంపెనీ ఎప్పుడు లేఆఫ్ ప్రకటిస్తుందో తాజా తరుణంలో ఎల్ అండ్ టీ టెక్నాలజీ ప్రకటన భూకంపంలా వచ్చింది. L&T టెక్నాలజీ దాదాపు 24,000 మంది ఉద్యోగులతో దాదాపు 1 శాతం ఉద్యోగులను తొలగించింది. కస్టమర్లకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. జనవరిలో మరో రౌండ్ తొలగింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ ప్లాంట్ ఇంజినీరింగ్, డిజిటల్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఏఐ, సాఫ్ట్‌వేర్ డిఫైన్‌డ్ వెహికల్స్ విభాగాల్లో దాదాపు 2500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications