Lenovo: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విధానపరమైన చర్యలు కొన్ని కంపెనీలకు కలిసొస్తున్నాయి. ఇది పరోక్షంగా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని సైతం భారీగా తగ్గిస్తోంది.
వాస్తవానికి దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ 2.0 పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీని సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తాజాగా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) లిమిటెడ్ Lenovo నుంచి పెద్ద వర్క్ ఆర్డర్‌ను అందుకుంది. దీంతో రెండు రోజులుగా కంపెనీ షేర్ ధర దాదాపు 11 శాతానికి పైగా లాభపడింది.

డిక్సన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ Padget Electronics Private Ltd లెనోవో నుంచి ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌ల కోసం ఆర్డర్‌ల తయారీకి అందుకుంది. అయితే డీల్‌కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు వెల్లడికాలేదు. డిక్సన్ ఐటి హార్డ్‌వేర్ ఉత్పత్తులను తయారు చేయడానికి ఆర్డర్‌ను పొందిందని స్టాక్ మార్కెట్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడికావటంతో స్టాక్ పెరుగుదలను నమోదు చేసింది. నేడు మధ్యాహ్నం 12.08 గంటల సమయంలో స్టాక్ ధర NSEలో 2.79 శాతం పెరుగుదలతో రూ.6,550 వద్ద కొనసాగుతోంది. దీంతో షేర్ తన 52 వారాల గరిష్ఠానికి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
సోమవారం నాడు బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 6.83 శాతం లాభపడి రూ.6,372 స్థాయి వద్ద ముగిసింది. ఇదే క్రమంలో మంగళవారం ఇంట్రాడేలో 4 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీలో షేర్ ధర 55 శాతానికి పైగా పెరిగాయి. ఇదే సమయంలో స్టాక్ గత నెలలో 28 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications