CEO's Exit: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. భారత కంపెనీల్లో కల్లోలం..

CEO's Resignation: కరోనా మహమ్మారి తర్వాత భారత కార్పొరేట్ రంగంలో భారీ మార్పులు కొనసాగుతున్నాయి. చాలా కంపెనీల్లో అగ్రనాయకత్వ పాత్రలో ఉన్న వ్యక్తులు తమ బాధ్యతలను వీడుతున్నారు.

కోవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు నిష్క్రమిస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో NSE-లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. 2022లో జనవరి-అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే అత్యధిక టర్నోవర్ నమోదైంది.

Indian companies top executives MD, CEOs resigning heavily after covid, know shocking data

2023లో నమోదైన నిష్క్రమణల్లో ఎక్కువ భాగం పదవీ విరమణల కంటే అత్యధికంగా రాజీనామాల వల్ల జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం యుద్ధం వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా అగ్రశ్రేణి రాజీనామాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

మహమ్మారి సమయంలో తక్కువ అట్రిషన్ అనేది కొవిడ్ తర్వాత మార్పులకు దారితీసింది. పెండెంట్-అప్ అట్రిషన్, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మరిన్ని అవకాశాలను సృష్టించడం కంపెనీల సీఈవోలు, ఎండీలకు గణనీయమైన వేతన పెంపులకు దారితీసింది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల టర్నోవర్ ఇదే విధంగా నమోదైంది. దీంతో గ్లోబల్ CEO టర్నోవర్ ఇండెక్స్ 2022లో ఐదేళ్ల గరిష్ట రేటు 11.2% నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+