Indian Companies: గ్లోబలైజేషన్ మహత్యంతో భారత కంపెనీలు భారీగా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులతో దాదాపు 4.25 లక్షల మందికి ఉపాధిని సృష్టించాయి.
'ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్' పేరుతో సీఐఐ విడుదల చేసిన తాజా ఎడిషన్ ప్రకారం భారతీయ సంస్థలు ఎక్కువగా టెక్సాస్ లో పెట్టుబడులను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఆ తర్వాత జార్జియా, న్యూజెర్సీ, న్యూయార్క్, మసాచుసెట్స్ నిలిచాయి. రిమోట్ వర్క్ పద్ధతిలో అక్కడ 35 వేల ఉద్యోగాలను సృష్టించాయి. అలాగే US డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో 220కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి.

సీఐఐ 2023 నివేదిక ప్రకారం అమెరికాలో 29% భారతీయ పెట్టుబడులు లైఫ్ సైన్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నాయని పేర్కొంది. అలాగే 21% కంపెనీలు IT అండ్ టెలికామ్‌లో, 18% తయారీ రంగంలో, 10% ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్ అండ్ డిజైన్ సర్వీసెస్‌లో.. 5% ఆటోమోటివ్‌లో, 4% ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో, 3% టూరిజం & హాస్పిటాలిటీలో, 2% ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను కలిగి ఉన్నాయి.

భారత కంపెనీలు భారీగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(R&D)లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం దాదాపు 195 మిలియన్లు వెచ్చించాయి. రానున్న ఐదేళ్లలో తమ పెట్టుబడులను పెంచాలని 83 శాతం కంపెనీలు యోచిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. అలాగే అక్కడ కొత్త ఉద్యోగులను సైతం నియమించుకోవాలని భావిస్తున్నాయని తేలింది.


Click it and Unblock the Notifications