Indian Companies: స్వతంత్ర భారతావనిలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మనలను దోపిడీ చేయడం గురించి తప్ప దేశాభివృద్ధి గురించి ఏ కోశానా ఆలోచించిన దాఖలాలు లేవు. అందుకే పరిశ్రమల స్థాపన, వర్తక, వాణిజ్యాలలో భారతీయులను ఎదగనిచ్చేవారు కాదు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన భారత్.. క్రమంగా తనదైన శైలిలో వ్యాపారం దిశగా అడుగులు వేసింది. అప్పట్లో స్థాపించిన ఎన్నో కంపెనీలు, సంస్థలు ఇప్పటికీ ప్రజాసేవలో వెలుగులీనుతున్నాయి.
అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మరియు ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు ప్రజా రవాణా విషయంలో ఒక అడుగు ముందుకేసి ఆలోచించాయి. అందుకే 1947లోనే బస్సు సర్వీసులను ప్రారంభించాయి. మొదట్లో రోజువారీ అద్దె ప్రాతిపదికన బస్సు తీసుకుని నడిపిన అహ్మదాబాద్.. తదనంతర కాలంలో సొంతగా కొనుగోలు చేసింది. క్రమంగా విస్తరిస్తూ ఈ రెండు సంస్థలు ఇప్పటికీ విజయవంతంగా ప్రజా సేవలో తరిస్తున్నాయి. ఇక అంబికా ఎయిర్ లైన్స్ ఆ రోజుల్లోనే ముంబై, వడోదర, అహ్మదాబాద్ మధ్య వారానికి రెండుసార్లు విమానాలు నడిపి చరిత్ర సృష్టించింది. ఈ అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ కాలక్రమమంలో 1949లో తన ప్రస్థానాన్ని ముగించింది.

గుజరాత్ కార్యాలయంగా 1947లో అతుల్ కంపెనీ స్థాపించబడింది. ఇది వివిధ రకాల కెమికల్స్ మరియు రసాయన సంబంధిత ఉత్పత్తులను ఇప్పటికీ విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ లిస్టెడ్ సంస్థ ఆదాయం దాదాపు నాలుగున్నర వేల కోట్లుగా ఉంది. అదే ఏడాది స్థాపించబడిన బాంబే ఆయిల్ ఇండస్ట్రీస్ కూడా విజయపథంలో దూసుకుపోతోంది. పారాచూట్, సఫోలా వంటి ప్రసిద్ధ బ్రాండ్లతో దేశవ్యాప్తంగా విస్తరించి కొబ్బరి, మంచి నూనె తయారిలో అగ్రగామిగా ఉంది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన బ్యాటరీ తయారీదారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదే పురుడు పోసుకుంది. ప్రస్తుతం 16 వేల కోట్ల ఆదాయంతో కేవలం భారత్ మాత్రమే కాకుండా శ్రీలంక, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లోనూ విస్తరించింది. ఇప్పుడు 60 దేశాలకు బ్యాటరీలను ఎగుమతి చేస్తోంది. 1947లో హైదరాబాద్ గోల్డ్ మైన్స్ పేరిట నెలకొల్పబడిన ప్రస్తుత హట్టి గోల్డ్ మైన్స్ ఇప్పటికీ బంగారం మైనింగ్ కార్యకర్తలు నిర్వహిస్తోంది. ఇది ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తోంది.
భారతదేశ ఫైనాన్షియల్ మార్కెట్ల చరిత్రలో ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ప్రముఖ స్థానం ఉంది. ఇందులో దాదాపు 3 వేల కంపెనీలు లిస్ట్ అయ్యాయి. 1947 నుంచి 2017 వరకు విజయవంతంగా సేవలు అందించింది. అనంతరం ప్రాభవం కోల్పోయింది. దేశీయ ప్రముఖ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) కూడా అదే ఏడాది ప్రారంభించబడింది. ది హిందూ గ్రూప్ కు చెందిన కస్తూరి శ్రీనివాసన్ ఛైర్మన్‌గా చెన్నైలో నెలకొల్పబడింది. ఇప్పటికీ భారత్లో విజయవంతమైన మీడియా సంస్థగా కొనసాగుతుంది. చెన్నైలో స్టార్ట్ చేయబడిన భరణి పిక్చర్స్ కూడా 1948 నుంచి 1987 వరకు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications