Brand Value: ఆర్థికాభివృద్ధి పరంగా భారతీయ కంపెనీలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఇక ప్రపంచ దేశాల్లోని IT కంపెనీలు బిత్తర చూపులు చూస్తున్న వేళ.. దేశీయ కంపెనీలు భారీ డీల్స్ సొంతం చేసుకుంటూ ప్రత్యర్థులను షాక్‌కు గురిచేస్తోంది. తద్వారా అంతర్జాతీయ విపణిలో వివిధ రంగాలు దిగ్గజ సంస్థలతో పోటీపడి రాణిస్తున్నాయి.
ఈ ఏడాది 100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్‌ల జాబితాలో 4 భారతీయ కంపెనీలు స్థానం సంపాదించాయి. కాంటార్ బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో భారతీయ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంక్ , ఎయిర్‌టెల్ మరియు ఇన్ఫోసిస్ లు చోటుదక్కించుకున్నాయి. అంతేకాకుండా లులులెమోన్ మరియు కొరోనాతో సహా 5 కంపెనీలు కొత్తగా టాప్ 100లో చేరాయి.

TCS సుమారు 44.8 బిలియన్ డాలర్లతో 46వ అత్యంత విలువైన ప్రపంచ బ్రాండ్‌గా ఉద్భవించింది. HDFC బ్యాంక్ దాదాపు 43.3 బిలియన్ డాలర్లతో టాటాల కంపెనీ వెన్నంటే 47వ స్థానంలో నిలిచింది. 25.3 బిలియన్ డాలర్లతో ఎయిర్‌టెల్ 73, ఇన్ఫోసిస్ సుమారు 24.7 బిలియన్ డాలర్లతో 74వ బిగ్గెస్ట్ కంపెనీలుగా కొనసాగుతున్నాయి. టాప్ 100లోని అన్ని భారతీయ బ్రాండ్ల సంయుక్త బ్రాండ్ విలువ 130 బిలియన్ డాలర్లను అధిగమించింది.
ఈ జాబితాలో అమెరికన్ దిగ్గజ కంపెనీ ఆపిల్ అగ్రస్థానంలో నిలిచింది. 1 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువతో వరుసగా మూడోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 753.5 బిలియన్ డాలర్లతో గూగుల్ 2, మైక్రోసాఫ్ట్ 712.9 బిలియన్ డాలర్లతో టాప్ 3లో ఉన్నాయి. తదనంతర స్థానాల్లో వరుసగా అమెజాన్, మెక్‌డొనాల్డ్స్, ఎన్‌విడియా, వీసా, ఫేస్‌బుక్, ఒరాకిల్, టెన్సెంట్‌లు చోటు దక్కించుకున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications