ITC Q4 Results: ఐటీసీ లాభాల జోరు.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..

ITC Q4 Results: దేశంలోని ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో మంచి వాటాను కలిగి ఉన్న కంపెనీ ఐటీసీ. నెమ్మదిగా నడిచినా విజయాన్ని చేరుకోవచ్చని అనేక మార్లు రుజువుచేసింది ఈ కంపెనీ షేర్. అయితే కంపెనీ తాజాగా తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.రూ.5,086.90 కోట్లగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.4,190.96 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 21.37 శాతం అధికం. కంపెనీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో రూ.17,224 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో సిగరెట్ బిజినెస్ నుంచి ఆదాయం రూ.7,355.83 కోట్లుగా ఉంది.

ITC

కంపెనీ ఇతర FMCG విభాగం సంవత్సరానికి రూ.4,944.95 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఇదే సమయంలో హోటల్స్ సెగ్మెంట్ ఆదాయం సంవత్సరానికి రూ.781.71 కోట్లకు చేరుకుంది. అలాగే వ్యవసాయ-వ్యాపారం విక్రయాలు రూ.3,578.60 కోట్లకు పడిపోయాయని నివేదించింది. ఇక పేపర్‌బోర్డ్ విభాగం ఆదాయం రూ.2,221 కోట్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత అంతరాయాలు తొలగటంతో కంపెనీ వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ITC

ద్రవ్యోల్బణం నుంచి కమోడిటీల ధరలు, ఇంధన భారం వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు కొనసాగినట్లు కంపెనీ వెల్లడించింది. ద్రవ్యోల్బణం గృహ బడ్జెట్‌లలోకి ప్రవేశించడంతో.. వినియోగ డిమాండ్ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మార్కెట్లలో విచక్షణతో కూడిన వర్గాలకు తగ్గిందని ITC తెలిపింది. సవాళ్లతో కూడిన ఆపరేటింగ్ వాతావరణం నేపథ్యంలో కంపెనీ వ్యూహాలు బలమైన పనితీరును అందించడానికి వీలు కల్పించినట్లు తెలిపింది. అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.9.50 డివిడెండ్ చెల్లించటానికి మే 30 రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+