Gold Rate: రెండో రోజూ కుప్పకూలిన గోల్డ్ రేటు.. రూ.3,200 తగ్గిన ధర, షాపింగ్ లేటు చేయెుద్దు..
Gold Price Today: దేశీయంగా పసిడి ధరలు గడచిన రెండు రోజులుగా తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. దాదాపు నెల ప్రారంభం నుంచి భారతీయులను వణికిస్తున్న గోల్డ్ ధరలు ప్రస్తుతం చల్లారుతున్నాయి. బడ్జెట్ ప్రసంగానికి ముందు ధరలు దిగివస్తున్నాయి. దీంతో షాపింగ్ చేయాలనుకుంటున్న చాలా మంది ప్రస్తుతం ధరల తగ్గింపును వినియోగించుకోవాలని చూస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7510, ముంబైలో రూ.7510, దిల్లీలో రూ.7525, కలకత్తాలో రూ.7510, బెంగళూరులో రూ.7510, కేరళలో రూ.7510, వడోదరలో రూ.7515, జైపూరులో రూ.7525, కోయంబత్తూరులో రూ.7510, మంగళూరులో రూ.7510, నాశిక్‌లో రూ.7513, అయోధ్యలో రూ.7525, బళ్లారిలో రూ.7510, గురుగ్రాములో రూ.7525, నోయిడాలో రూ.7525 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3200 భారీ తగ్గింపును నేడు చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.8193, ముంబైలో రూ.8193, దిల్లీలో రూ.7525, కలకత్తాలో రూ.8193, బెంగళూరులో రూ.8193, కేరళలో రూ.8193, వడోదరలో రూ.8198, జైపూరులో రూ.8208, కోయంబత్తూరులో రూ.8193, మంగళూరులో రూ.8193, నాశిక్‌లో రూ.8196, అయోధ్యలో రూ.8208, బళ్లారిలో రూ.8193, గురుగ్రాములో రూ.8208, నోయిడాలో రూ.8208గా ఉన్నాయి.
ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7510గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8193 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7510గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8193 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి తగ్గి నేడు రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications