ఏడాది వయసున్న కూతురికి రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్.. అసలు ఎవరు ఈ సతీష్ సన్పాల్ ?
తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులు అందరు కూడా వాళ్ళ పిల్లలకు ప్రేమగా ఎదో ఒక గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు. అయితే దుబాయ్‌లో ఉంటున్న ఒక భారతీయ వ్యాపారవేత్త తన కూతురికి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయనే సతీష్ సన్పాల్. ఫాదర్స్ డే సందర్భంగా తన ఏడాది వయసున్న కూతురికి ఏకంగా పింక్ కలర్ రోల్స్ రాయిస్ కారును గిఫ్టుగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.

దుబాయ్‌కు చెందిన ANAX డెవలప్‌మెంట్స్ కంపెనీ యజమాని అయిన సతీష్ సన్పాల్, తన భార్య తబిందా సన్పాల్‌తో కలిసి కారు తాళంని తన కుమార్తె ఇసాబెల్లాకు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో కనిపించిన కారు ప్రకాశవంతమైన గులాబీ రంగులో ఉంది, లోపలి భాగం కూడా గులాబీ రంగులోనే డిజైన్ చేయబడింది. కారుపై 'కాంగ్రచులేషన్ ఇసాబెల్లా' అని రాసి ఉంది. ఈ కారును ఇంగ్లాండ్‌లోని ఇసాబెల్లా కోసం ప్రత్యేకంగా తయారు చేసి, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తీసుకువచ్చారని ఒక చిన్న నోట్‌లో కూడా పేర్కొన్నారు. కారు సీట్లపై ఇసాబెల్లా పేరులోని అక్షరాలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
కూతురిపై ఉన్న సతీష్ ప్రేమ : సతీష్ తన కూతురి కోసం ఇంతలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఫిబ్రవరిలో అతను తన కూతురు ఇసాబెల్లా మొదటి పుట్టినరోజును చాలా వైభవంగా జరుపుకున్నారు. ఈ పార్టీ దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్‌లో జరిగింది. ఈ గ్రాండ్ పార్టీకి బాలీవుడ్ తారలు తమన్నా భాటియా, నోరా ఫతేహి, అలాగే సింగర్ అతిఫ్ అస్లాం వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇసాబెల్లా ఫిబ్రవరి 25న లండన్‌లో జన్మించింది.
సతీష్ సన్పాల్ ఎవరు: సతీష్ సన్పాల్ వ్యాపార ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన ANAX హోల్డింగ్ చైర్మన్. ఇది $3 బిలియన్ల విలువ ఉన్న ఒక పెద్ద గ్రూప్. ఈ గ్రూప్‌లో చాల కంపెనీలు ఉన్నాయి. వాటిలో, ANAX డెవలప్‌మెంట్స్ రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉంది, కాగా ANAX హాస్పిటాలిటీ ప్రీమియం రిసార్ట్‌లు, రెస్టారెంట్‌లను నిర్వహిస్తుంది. నిజానికి ANAX హోల్డింగ్ అనేది వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే ఒక పెట్టుబడి సంస్థ.
15 ఏళ్లకే వ్యాపారంలోకి అడుగు: భారతదేశంలో జన్మించిన సతీష్ సన్పాల్ కేవలం 15 సంవత్సరాల వయసులోనే తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. అతను దుబాయ్‌లో స్టాక్ మార్కెట్, ఐటీ, బంగారు వ్యాపారం ఇంకా రియల్ ఎస్టేట్ రంగాలలో పనిచేశాడు. దుబాయ్‌లో మంచి అవకాశాలను గుర్తించి అక్కడికి వెళ్లి ANAX హోల్డింగ్‌ను స్థాపించారు.
అతను సతీష్ సన్పాల్ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవలో కూడా పాలుపంచుకుంటారు. ఉగాండాలో నీటి సమస్యను పరిష్కరించడంలో, భారతదేశంలోని పేద వితంతువులకు సహాయం చేయడంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా లేడీ చెరీ బ్లెయిర్ చేతుల మీదుగా లుంబా ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు.
అతని నికర విలువ ఎంత: సతీష్ సన్పాల్ స్వతహాగా చాలా స్టైలిష్‌గా ఉంటారు, ఖరీదైన వస్తువులపై బాగా ఖర్చు చేస్తారు. అతనికి కార్లంటే కూడా చాలా ఇష్టం. సతీష్ వద్ద 35 కోట్ల విలువైన బుగట్టి చిరాన్ కారు ఉంది. తన పుట్టినరోజున ఈ కారును తనకు తానుగా గిఫ్టుగా ఇచ్చుకున్నారు. 2023 సంవత్సరంలో సతీష్‌కు దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన చేసిన కృషికి గోల్డెన్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సతీష్ సన్పాల్ నికర విలువ ఒక బిలియన్ డాలర్లు సుమారు రూ.8,300 కోట్లు.


Click it and Unblock the Notifications