Gautam Adani: దాదాపు నాలుగు నెలల తర్వాత గౌతమ్ అదానీకి మంచి రోజులు మళ్లీ తిరిగొచ్చాయని చెప్పుకోవచ్చు. భారత బిలీనియర్ కొన్ని నెలల కిందట ఆసియాలోనే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో రికార్డులను సృష్టించారు.
హిండెన్ బర్గ్ నివేదికతో ఏర్పడిన తుపాను అదానీ గ్రూప్ వ్యాపారాలను అతలాకుతలం చేసేసింది. దీని నుంచి తేరుకోవటానికి అదానీ గ్రూప్ చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో సెబీ దర్యాప్తు వ్యవహారంలో ఊరట లభించిన తర్వాత గ్రూప్ షేర్లు బుల్ పరుగులు మెుదలెట్టాయి. దీంతో ఆయన సంపద రోజురోజుకూ పెరుగుతోంది.

ప్రస్తుతం ఆసియాలో భారత వ్యాపారి ముఖేష్ అంబానీ మెుదటి స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ రెండవ స్థానానికి పరిమితమయ్యారు. అలాగే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ఇప్పుడు 23 స్థానాల నుంచి 18వ స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 64.2 బిలియన్ డాలర్లుగా ఉంది. మంగళవారం నాటికి అతని నికర విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల్లో తొమ్మిది మంది అమెరికన్లు ఉన్నారు. బిల్లెట్స్ 125 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో, వారెన్ బఫెట్ 113 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో, లారీ ఎల్లిసన్ 111 బిలియన్ డాలర్లతో 6వ స్థానంలో ఉన్నారు. లారీ పేజ్ $111 బిలియన్లతో 7వ స్థానంలో, స్టీవ్ బాల్మెర్ $110 బిలియన్లతో 8వ స్థానంలో, Sggy Breen $105 బిలియన్లతో 9వ స్థానంలో,$90.3 బిలియన్లతో మార్క్ జుకర్‌బర్గ్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications