Elon Musk: ట్విట్టర్ డీల్ పై హర్ష గోయంకా ట్వీట్.. మస్క్ రజనీకాంత్ స్టైల్ లో వైరల్..
Elon Musk: ట్విట్టర్ ను ఆదాయం కోసం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సౌలభ్యం కోసం కొనుగోలు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ఇప్పటికే చెప్పారు. కంపెనీని కొనుగోలు చేసిన తర్వాత పక్షికి స్వేచ్ఛ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు.
కొత్త ప్రణాళికలు..
కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాన్ మస్క్ వేసిన తొలి అడుగు సీఈవో బరాక్ అగర్వాల్‌ను తొలగించడం. బరాక్ అగర్వాల్ తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గాడేలను కూడా తొలగించారు. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను పూర్తిగా నియంత్రించిన 24 గంటల్లోనే, ట్వీట్ టైల్స్ అనే కొత్త సేవను పరీక్షిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

హర్ష గోయంకా..
సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే భారత వ్యాపారవేత్త హర్ష గోయంకా తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పై ఒక పోస్ట్ చేశారు. రజనీకాంత్ సినిమాలోని ఒక సీన్ మీమ్ ను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ప్రపంచ కుబేరుడు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఆఫీసులో మెుదటగా సీఈవోను తొలగించటంతో పాటు ఇతరులపై చర్యలు చేపట్టడాన్ని ఇది సూచిస్తోంది.

100 మిలియన్ డాలర్లు..
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో 100 శాతం షేర్లను పొందాలనుకుంటున్నారు కాబట్టి, CXO విభాగంలోని ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చే షేర్లకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ట్విట్టర్‌లో తొలగించబడిన 5 మందిలో ముగ్గురు మాత్రమే సుమారు 100 మిలియన్ డాలర్లతో నిష్క్రమిస్తారు. ఇది మస్క్ పై అదనపు భారమనే చెప్పుకోవాలి. 2011లో ట్విట్టర్ కంపెనీలో చేరిన బరాక్ అగర్వాల్ నవంబర్ 2021లో సీఈవో బాధ్యతలు చేపట్టి, మస్క్ రాకతో కంపెనీని వీడుతున్నారు.

విజయ గద్దె..
కంపెనీ లీగల్ చీఫ్ అయిన తెలుగు మహిళ విజయ గద్దెను ఎలాన్ మస్క్ ముందునుంచే టార్గెట్ చేశారు. ఎందుకంటే ట్విట్టర్ విధాన నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారాలను ట్విట్టర్ లో అరికట్టడంతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేయటంలో ఆమెది కీలక పాత్ర. అందుకే ఈమెను కంపెనీ నుంచి పంపటానికి మస్క్ 17 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications