Adani Green Stock: ప్రస్తుతం హిండెన్ బర్గ్ 2.0 దాడి తర్వాత నేడు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు మార్కెట్లో పతనాన్ని చూశాయి. సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్ పై ఆరోపణల మధ్య ఇన్వెస్టర్లు అదానీ షేర్లతో జాగ్రత్త వహిస్తున్నారు.
అయితే ప్రస్తుతం అందరి చూపు అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ షేర్లపైనే ఉంది. నేడు ఇంట్రాడేలో స్టాక్ ధర 7 శాతం మేర పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ శుక్రవారం నాడు అదానీ గ్రూప్ స్టాక్‌పై కవరేజీని ప్రారంభించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్లు ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఒక్కోటి 50 శాతం పెరగొచ్చని తన అంచనాలను ప్రకటించింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్, రాజస్థాన్‌లలో 50GW కంటే ఎక్కువ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అభివృద్ధి కోసం సురక్షితమైన సైట్‌లను కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో వనరుల దిగుబడి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. నేడు ట్రేడింగ్ సెషన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 6.96 శాతం పతనమై రూ.1,656.05కి పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.62 లక్షల కోట్లకు తగ్గింది. కంపెనీ నికర రుణం 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.9200 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.53,900 కోట్లకు పెరిగింది. అయితే ఇది 2030 నాటికి తగ్గుతుందని బ్రోకరేజ్ పేర్కొంది.
జూన్ 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో అదానీ గ్రీన్ ఎనర్జీ వార్షిక ప్రాతిపదికన 38 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.446 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 31 శాతం పెరిగి రూ.2,834 కోట్లకు చేరుకుంది. విద్యుత్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయం 24 శాతం పెరిగి రూ.2528 కోట్లకు చేరుకోగా.. ఎబిటా 23 శాతం పెరిగి రూ.2,374 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఎంకే గ్లోబల్ అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లకు బై రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను ఒక్కో షేరుకు రూ.2,550గా ప్రకటించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications