For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indians Investing: విదేశాలకు భారతీయ సంపన్నుల డబ్బు.. రికార్డు స్థాయిలో.. మనపై నష్టం ఇదే..

|

Indians Investing: సంపన్న భారతీయులు తమ డబ్బును విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును ఈ వార్త వినటానికి షాకింగ్ గా అనిపిస్తున్నప్పటికీ రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ రేట్లు పెరుగుదల, రూపాయి పతనం ఇందుకు కొన్ని కారణాలని నిపుణులు అంటున్నారు.

ఏఏ దేశాలకు తరలిస్తున్నారంటే..

ఏఏ దేశాలకు తరలిస్తున్నారంటే..

సంపన్న భారతీయులు దుబాయ్, న్యూయార్క్, లండన్, పోర్చుగల్ వంటి ప్రదేశాల్లో ఆస్తి పెట్టుబడులు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లతో పాటు ఇతర సాధనాల్లోనూ వీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.69 బిలియన్ డాలర్లను ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు.

డబ్బు పంపటమే కాదు.. వలసవెళ్లిపోతున్నారు..

డబ్బు పంపటమే కాదు.. వలసవెళ్లిపోతున్నారు..

ధనిక భారతీయులు కేవలం డబ్బును పంపటమే కాదు వారే స్వయంగా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. నివేదికల ప్రకారం ఈ ఏడాది ఇలా 8 వేల మంది తరలిపోయారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా విదేశాలకు తరలిపోతున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెరగడానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక కారణం. వారు తమ వినియోగదారుల డబ్బును విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. ఫిబ్రవరిలో పరిస్థితి నిషేధం విధించే స్థాయికి చేరుకుంది.

డబ్బు తరలిపోతే నష్టమేంటి..?

డబ్బు తరలిపోతే నష్టమేంటి..?

ధనవంతులైన భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడితే దాని వల్ల మనకొచ్చే నష్టమేమేంటని అనుమానం కలగవచ్చు. పెట్టుబడుల రూపంలో ఆలోచిస్తే నష్టం లేకపోయినప్పటికీ.. ఈ ధోరణి దేశానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పన్ను వసూళ్లు తగ్గుతాయి. ఆ తరువాత దేశంలోని ప్రజలపైనే ఆ భారం పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

విదేశాల్లో పెట్టుబడులు ఎందుకు పెరిగాయి?

విదేశాల్లో పెట్టుబడులు ఎందుకు పెరిగాయి?

భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అందులో దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరగటం కూడా ఒకటి. డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకే ధనవంతులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. HDFC, ICICI వంటి దిగ్గజ బ్యాంకులు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని సౌకర్యవంతంగా చేయటం కూడా మరో కారణంగా ఉంది.

 డాలర్ పుంజుకోవటంతో..

డాలర్ పుంజుకోవటంతో..

భారతీయులు విదేశాల్లో స్థిరాస్తిపై ఆసక్తి చూపుతున్నారు. న్యూయార్క్, దుబాయ్ వంటి మార్కెట్లలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. డాలర్ డామినేటెడ్ మార్కెట్లు కావడం ఇందుకు ఒక కారణం. డాలర్‌తో రూపాయి పడిపోవడం కారణంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి ఎక్కువ విలువను పొందుతారు.

English summary

Indians Investing: విదేశాలకు భారతీయ సంపన్నుల డబ్బు.. రికార్డు స్థాయిలో.. మనపై నష్టం ఇదే.. | indian billionaires taking money out of the country to dubai, london and other countries

indian billionaires taking money out of the country know effects
Story first published: Tuesday, August 2, 2022, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X