Gautam Adani: భారత దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరుగా ఉన్న గౌతమ్ అదానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సారి ఏకంగా ప్రపంచ బిలియనీర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనంతో చాలా మంది కుబేరులు తమ సంపదను కోల్పోతున్నారు. మిలియన్ల డాలర్ల మేర సంపద ఆవిరవుతోంది. కానీ అది అదానీకి వర్తించలేదు. ప్రపంచంలోని టాప్-50 బిలియనీర్లలో అత్యధికంగా సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచి అందరి మతి పోగొడుతున్నారు. భారత వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సైతం 685 మిలియన్ డాలర్ల మేర సంపదను కోల్పోయారు. చైనీస్ బిలియనీర్ ఝాంగ్ షన్షాన్ 1.80 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు.

నష్టపోయిన బిలియనీర్లు..:ఈ క్రమంలో ఫెడ్ నిర్ణయం వెలువడిన తర్వాత గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలోనే నడిచాయి. ప్రధాన కంపెనీలుగా ఉన్న టెస్లాలో 2.62 శాతం, ఆపిల్ ఇంక్ 0.89 శాతం, అమెజాన్ ఇంక్ 4.41 శాతం షేర్ విలువను కోల్పోయాయి. అలాగే యూరోపియన్ మార్కెట్లతో పాటు ఇతర ఆసియా మార్కెట్లు సైతం కుదేలయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపదపై భారీ ప్రభావాన్ని చూపింది.

అదానీ సూపర్ గెయిన్..:ఈ క్రమంలో టాప్-10లో కొనసాగుతున్న జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, లారీ ఎల్లిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద భారీ క్షీణతను నమోదు చేసింది. ఇదే సమయంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గురువారం టాప్ గెయినర్‌గా గౌతమ్ అదానీ నిలిచారు. 19వ స్థానంలో ఉన్న అదానీ సంపద 678 మిలియన్ డాలర్ల మేర పెరగి 65.4 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. థాయ్‌లాండ్‌కు చెందిన బిలియనీర్ శరత్ రత్నవాడియా సంపద 241 మిలియన్ డాలర్లు పెరిగి అత్యధికంగా లాభపడిన బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications