Adani News: దేశంలో పరిచయం అక్కర్లేని వ్యాపారవేత్తల్లో ఒకరు గౌతమ్ అదానీ. 61 ఏళ్ల బిలియనీర్ దేశంలోని అనేక కీలక రంగాల్లో తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఆయన వేతనంపై పడింది. ఇతర వ్యాపారవేత్తల కంటే తక్కవ వేతనం తీసుకుంటున్న అదానీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.9.26 కోట్లను వేతనంగా అందుకున్నారు. ఇది వ్యాపార రంగంలో సహచర వ్యాపారవేత్తలు అందుకుంటున్న దాని కంటే తక్కువని చెప్పుకోవచ్చు. పోర్ట్స్ నుంచి ఎనర్జీ వరకు దాదాపు 10 లిస్టెడ్ కంపెనీలను నిర్వహిస్తున్న 61 ఏళ్ల గౌతమ్ అదానీ కేవలం రెండింటి నుంచి మాత్రమే వేతనం అందుకుంటున్నట్లు సదరు సంస్థల ఆర్థిక నివేదికల ప్రకారం వెల్లడైంది.

గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2023-24 సంవత్సరంలో రూ.2.19 కోట్ల వేతనం, రూ.27 లక్షల విలువైన ఇతర సౌకర్యాలను అందుకున్నారు. అలాగే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నుంచి రూ.6.8 కోట్ల వేతనాన్ని అదానీ అందుకున్నారు. అదానీ జీతం భారతదేశంలోని దాదాపు అన్ని పెద్ద కుటుంబ యాజమాన్యంలోని సమ్మేళనాల అధిపతుల కంటే తక్కువగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద 106 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే క్రమంలో ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి స్థానం కోసం అంబానీతో గౌతమ్ అదానీ పోటీపడుతున్నారు.
దేశంలోని ఇతర వ్యాపారవేత్తల వేతనాలను పరిశీలిస్తే.. కరోనా కాలం నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. అలాగే టెలికాం జార్ సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ.16.7 కోట్లు, రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, పవన్ ముంజాల్ రూ.80 కోట్లు, L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ CEO సలీల్ S పరేఖ్ వేతనాలు అధికంగా ఉన్నాయి.
అదానీ తమ్ముడు రాజేష్ AEL నుంచి రూ.4.71 కోట్ల కమీషన్‌తో సహా రూ.8.37 కోట్లు పొందగా, అతని మేనల్లుడు ప్రణవ్ అదానీ రూ.4.5 కోట్ల కమీషన్‌తో సహా రూ.6.46 కోట్లు పొందినట్లు వార్షిక నివేదికల ప్రకారం వెల్లడైంది. అయితే AEL నుంచి గౌతమ్ అదానీ ఎలాంటి కమిషన్ అందుకోలేదు. APSEZ నుండి ₹5 కోట్లు పొందారు. అతని కుమారుడు కరణ్ APSEZ నుంచి రూ.3.9 కోట్లు సంపాదించాడు. AEL బోర్డులో కీలక ఎగ్జిక్యూటివ్ అండ్ డైరెక్టర్ అయిన వినయ్ ప్రకాష్ మొత్తం రూ.89.37 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. గ్రూప్ CFO జుగేషీందర్ సింగ్ రూ.9.45 కోట్లను వేతనంగా పొందారు.
ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో రూ.15.25 కోట్లు చెల్లించగా, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ సీఈవో సురేష్ పి మంగ్లానీ రూ.6.88 కోట్లు, అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మల్లిక్ రూ.5.15 కోట్లు పొందారు. అదానీ పవర్ సీఈవో SB ఖలియా రూ.5.63 కోట్లు పొందారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications