Stock Market: ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న మార్కెట్లు.. నష్టాల్లో ఐటీ స్టాక్స్..
Volatile Markets: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త వారం ఓలటాలిటీ కమ్ముకుంది. ఈ క్రమంలో కీలక సూచీలు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తుండగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోని కంపెనీల షేర్లు మాత్రం 1 శాతం మేర లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. అయితే మార్కెర్లలో అలుముకున్న ఒడిదొడుకుల కారణంగా నిఫ్టీ బ్యాంక్ సూచీ స్వల్పంగా 28 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 16 పాయింట్ల మేర నష్టంలో కొనసాగుతోంది.

NSEలో బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, రిలయన్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎయిర్ టెల్, మారుతీ, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications