Stock Market: మార్కెట్లు సెప్టెంబర్ శుభారంభం.. సరికొత్త రికార్డులకు సెన్సెక్స్-నిఫ్టీ..
Opening Bell: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన బుల్ జోరుతో ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 82,725.28 మార్కును అందుకోగా.. నిఫ్టీ సూచీ 25,333.65 మార్కును చేరుకుంది. మార్కెట్లలో ఇన్వెస్టర్లు ప్రధాన డేటా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 215 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 74 పాయింట్ల మేర లాభంతో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 24 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 44 పాయింట్లు లాభపడ్డాయి. ఈ క్రమంలో టాటా మోటార్స్ స్టాక్ నష్టాల్లో కొనసాగుతుండగా, గుజరాత్ గ్యాస్ కంపెనీ షేర్లు 8 శాతం లాభంతో ముందుకు సాగుతున్నాయి. హెచ్ఎస్బీసీ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, ఐపీవోల కోలాహలం, ఆటో సేల్స్ గణాంకాలు నేడు మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

NSEలో హీరో మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, శ్రీరామ్ పైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, మారుతీ, బజాజా ఫైనాన్స్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, బీపీసీఎల్ కంపెనీ షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్, సిప్లా, టైటాన్, ఎయిర్ టెల్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications