భారతీయ బ్యాంకుల్లో రూ.12 లక్షల కోట్లు జనం డబ్బు మాయం..! షాకింగ్, పూర్తి వివరాలివే..
Indian Banks: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం బలంగానే ఉంది. మోదీ సర్కార్ హయాంలో అనేక బ్యాంకులను విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఫలవంతంగా పనితీరును కనబరుస్తోంది. అయితే ఇప్పటికీ భారతీయ బ్యాంకులను వెంటాడుతోన్న విషయం నిరర్థక ఆస్థులే.
వివరాల్లోకి వెళితే.. 2015-2024 మధ్య ఆర్థిక సంవత్సరాల్లో భారతీయ బ్యాంకులు అతిపెద్ద షాక్ కి గురయ్యాయి. ఈ క్రమంలో బ్యాంకులు ఆశ్చర్యకరంగా రూ.12.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ప్రధానంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు భారీగా ఆర్థిక ఒత్తిడిని భరించాయి. గణాంకాల ప్రకారం ఈ రైటాఫ్ గడచిన ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.6.5 లక్షల కోట్లుగా నిలిచింది. ఇది మెుత్తం మాఫీ చేసిన రుణాల్లో దాదాపు 53 శాతం కావటం గమనార్హం.

2019 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ.2.4 లక్షల కోట్ల రుణాల మాఫీ జరిగింది. అయితే ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన క్షీణతను చూసి రూ.1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది మెుత్తం బ్యాంకులకు రావాల్సిన బాకీలైన రూ.165 లక్షల కోట్లలో ఒక్క శాతానికి సమానంగా ఉంది. సెప్టెంబర్ 30, 2024 నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు వరుసగా రూ.3.16 లక్షల కోట్లు, రూ.1.34 లక్షల కోట్లుగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ డేటా వెల్లడించింది. స్థూల నిరర్థక ఆస్తుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు 3.01% వాటాను కలిగి ఉండగా ప్రైవేటు బ్యాంకులు బకాయిల శాతం 1.86గా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకులపై అధిక ఒత్తిడిని కలిగి ఉన్నట్లు డేటా చెబుతోంది.
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రూ.2 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. దీని తర్వాత రెండవ స్థానంలో నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.94,702 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు సెప్టెంబరుతో ముగిసిన కాలానికి దాదాపు రూ.42,000 కోట్ల రుణాలను మాఫీ చేశాయి. ప్రభుత్వ బ్యాంకులు రుణాలను పుస్తకాల్లో క్లీన్ చేసేందుకు మాఫీని ప్రకటించటంపై వస్తున్న ఆందోళనలపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ బోర్డుల ఆమోదం మేరకు 4 ఏళ్లుగా నిరర్థకంగా ఉన్న రుణాలను పుస్తకాల నుంచి రద్దు చేస్తాయని వెల్లడించారు. అయితే ఇది రుణాలు పొందిన వ్యక్తులకు బాధ్యత నుంచి మాఫీ చేయవని వెల్లడించారు. ఈ రుణాలను తిరిగి రికవర్ చేసేందుకు పరిణామాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు.


Click it and Unblock the Notifications