Bank Holidays May 2023: ప్రతి నెల బ్యాంకులు ఎన్ని రోజులు అందుబాటులో ఉండవనే వివరాలను రిజర్వు బ్యాంక్ నిర్ణయించే హాలిడేస్ లిస్ట్ వెల్లడిస్తుంది. ఈ క్రమంలో దేశంలోని బ్యాంకులు మే 2023లో 11 రోజుల పాటు కస్టమర్లకు అందుబాటులో ఉండవని తెలుస్తోంది.
దేశంలోని బ్యాంకులు ఆదివారంతో పాటు రెండవ, నాల్గవ శనివారం సెలవులో ఉంటాయి. వీటికి తోడు కొన్ని నిర్థిష్ట సెలవు రోజుల్లో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులే కాక ప్రైవేటు బ్యాంకులు సైతం మూసివేయబడతాయి. అయితే ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండుగలకు అనుగుణంగా మారుతుంటాయి. అయితే జాతీయ ప్రభుత్వ సెలవులు మాత్రం అందరికీ సమానంగా ఉంటాయి.

బ్యాంకు శాఖలు ఈ సెలవు రోజుల్లో మూసివేసి ఉన్నప్పటికీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని బ్యాంకుకు వెళ్లి నేరుగా పూర్తి చేసుకోవాల్సిన పనులు మాత్రం తప్పకుండా సెలవులను గమనించుకోవాలి. లేకుంటే అత్యవసర పనులు సకాలంలో పూర్తికాక వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
మే 2023 రాష్ట్రాల వారిగా బ్యాంక్ సెలవులు..
మే 1, 2023 - మే డే/ మహారాష్ట్రా డే - Karnataka, Maharashtra, Tamil Nadu, Assam, Andhra Pradesh, Telangana, Kerala, Bengal, Goa, and Bihar
మే 5, 2023 - బుద్ధ పూర్ణిమ - Tripura, Mizoram, Maharashtra, Madhya Pradesh, Chandigarh, Uttarakhand, Jammu, Uttar Pradesh, Bengal, New Delhi, Chhattisgarh, Jharkhand, Himachal Pradesh
మే 7, 2023 - ఆదివారం సెలవు - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు
మే 9, 2023 - రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు - Bengal State
మే 13, 2023 - రెండవ శనివారం - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు
మే 14, 2023 - ఆదివారం - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు
మే 16, 2023 - సిక్కిం ఆవిర్భావ దినోత్సవం- Sikkim State
మే 21, 2023 - ఆదివారం - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు
మే 27, 2023 - నాల్గవ శనివారం - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు
మే 28, 2023 - ఆదివారం - అన్ని రాష్ట్రాల్లో బ్యాంలకు సెలవు


Click it and Unblock the Notifications