December Bank Holidays 2024: నేటితో డిసెంబర్ నెలలోకి ఎంటర్ అవ్వగానే అందరి చూపు బ్యాంక్ సెలవులపైనే ఉంది. అయితే రిజర్వు బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో దేశంలోని బ్యాంకులు దాదాపు 17 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయని వెల్లడైంది. ఇందులో వారాంతపు సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. నవంబరు నెలలో బ్యాంకులు దాదాపు 13 రోజుల పాటు సెలవులో ఉన్నాయి. దీపావళి, గురునానక్ జయంతి వంటి సెలవులతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవుల్లో ఉన్నాయి.
సాధారణంగా బ్యాంకులకు ఇచ్చే సెలవులు మూడు విధాలుగా వర్గీకరించబడ్డాయి. రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సెలవులతో, బ్యాంకుల ఖాతాల ముగింపు సెలవులతో పాటు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద అందించే సెలవులు అంటూ మూడు విధాలుగా వర్గీకరించబడ్డాయి. ప్రతినెల్ బ్యాంకులు రెండు-నాల్గవ శనివారం సెలవులో ఉంటాయి. 2015లో రిజర్వు బ్యాంక్ దేశంలోని నెలలోని రెండు, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవుగా రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీనికి ముందు బ్యాంకు శనివారం రోజున హాఫ్ డే వర్కింగ్‍లో ఉండేవి. దీనికి తోడు ప్రతినెల బ్యాంకులకు ఉండే వివిధ సెలవులు రిజర్వు బ్యాంక్ ముందుగా విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కొనసాగుతాయి.

డిసెంబర్ 2024లో బ్యాంక్ హాలిడేస్..
- డిసెంబరు 3: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు - పనాజీలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 12: పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా - షిల్లాంగ్‌లో బ్యాంకులు మూతపడతాయి.
- డిసెంబర్ 18: యు సోసో థామ్ మరణ వార్షికోత్సవం - షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 19: గోవా విమోచన దినం - పనాజీలో బ్యాంకులు పనిచేయవు.
- డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవ్ - ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 25: క్రిస్మస్ - క్రిస్మస్ రోజున, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 26: క్రిస్మస్ వేడుకలు - ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 27: క్రిస్మస్ వేడుకలు - కోహిమాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబర్ 30: యు కియాంగ్ నంగ్బా - షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
- డిసెంబరు 31: నూతన సంవత్సర పండుగ/లాసాంగ్/నామ్‌సూంగ్ - నూతన సంవత్సర పండుగ సందర్భంగా, ఐజ్వాల్, గాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
బ్యాంకులు భౌతికంగా సెలవుల వల్ల మూసివేతలో ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, డిజిటల్ ఫోన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. అలాగే ఏటీఎంలు, క్యాష్ డిపాజిటర్ మెషిన్లు ప్రజలకు సెలవుదినాల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులుఉండవు. అయితే ఏదైనా లోన్ సంబంధించి లేదా ఇతర పనులు ఉన్నట్లయితే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతిఒక్కరు తమకు ఉండే పనులను పూర్తి చేసుకోవటానికి బ్యాంకులు సెలవులో లేని రోజుల్లో శాఖలకు వెళ్లటం ఉత్తమం.


Click it and Unblock the Notifications