Bank Holidays in July 2024: మరో మూడు రోజుల్లో జూన్ నెల ముగిసిపోనుంది. ఈ క్రమంలో జూలై నెలలో బ్యాంక్స్ పనిదినాలకు సంబంధించిన వివరాల గురించి ప్రజలు తప్పక తెలుసుకోవాలి. సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తిచేసుకోవటానికి తగిన ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ వివరాలు చాలా ముఖ్యమైనవి.
జూలై 2024 నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మెుత్తంగా 12 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. వారాంతపు సెలవులతో పాటు జాతీయ, ప్రాంతీయ సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఉండనున్నాయి. అందువల్ల బ్యాంకులను సందర్శించటానికి వెళ్లటానికి ముందుగా ఈ సెలవుల వివరాలను తెలుసుకోవటం ఉత్తమం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సంబంధించిన సెలవులను ఆర్బీఐ ప్రతి ఏటా ముందుగానే నిర్ణయిస్తుంటుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్ట ప్రకారమే ఈ సెలవులు ఉంటాయి.

జూలై మాసంలో బ్యాంక్ సెలవుల వివరాలు..
- జూలై 03, 2024: మేఘాలయలోని బెహ్‌డింక్లామ్
- జూలై 06, 2024: మిజోరంలో మిజో హ్మీచే ఇన్సుయిహ్‌ఖామ్ పాల్ (MHIP) దినోత్సవం, శనివారం వారాంతపు సెలవు
- జూలై 07, 2024: ఆదివారం వారాంతపు సెలవు
- జూలై 08, 2024: మణిపూర్‌లో కాంగ్ రథ యాత్ర.
- జూలై 09, 2024: సిక్కింలో ద్రుక్పా త్షే-జి
- జూలై 13, 2024: శనివారం వారాంతపు సెలవు
- జూలై 14, 2024: ఆదివారం వారాంతపు సెలవు
- జూలై 16, 2024: ఉత్తరాఖండ్‌లోని హరేలా
- జూలై 17, 2024: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, మేఘాలయ, రాజస్థాన్, మిజోరం, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్‌లో అశురా / యు టిరోట్ సింగ్ డే / ముహర్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు త్రిపుర.
- జూలై 21, 2024: ఆదివారం వారాంతపు సెలవు
- జూలై 27, 2024: శనివారం వారాంతపు సెలవు
- జూలై 28, 2024: ఆదివారం వారాంతపు సెలవు
వాస్తవానికి పైన పేర్కొన్న రోజుల్లో భౌతికంగా బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పూర్తి స్థాయిలో డిజిటల్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ రూపంలో ప్రజలకు 24*7 అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల రుణాలు పొందటం, కేవైసీ, గోల్డ్ లోన్ పొందటం వంటి ముఖ్యమైన పనుల కోసం మాత్రం తప్పకుండా నేరుగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications