February Bank Holidays: ప్రతినెల మాదిరిగానే రిజర్వు బ్యాంక్ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో దేశంలోని బ్యాంకులు మూతపడనున్నాయి. అయిదే దేశంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు వీటికి అనుగుణంగా 11 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి.
వాస్తవానికి జనవరి మాసంలో బ్యాంకులు దాదాపు 16 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేవు. అందువల్ల నేరుగా బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన పనులను ఇన్వెస్టర్లు వెంటనే పూర్తి చేసుకునేందుకు సెలవుల వివరాలను తప్పక తెలుసుకోవాల్సిందే.

ఫిబ్రవరి 2024లో దేశంలోని బ్యాంకుల సెలవు దినాల లిస్ట్..
ఫిబ్రవరి 4- ఆదివారం సెలవు
ఫిబ్రవరి 10- రెండవ శనివారం, సరస్వతి పూజ
ఫిబ్రవరి 11- ఆదివారం సెలవు
ఫిబ్రవరి 14- వసంత పంచమి అగర్తల, భువనేశ్వర్, కలకత్తాలో బ్యాంకుల సెలవు
ఫిబ్రవరి 15- Lui-Ngai-Ni ఇంపాల్‌లో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 18- ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 19- చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ముంబై, బేలాపూర్, నాగ్‌పూర్ లలో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20- స్టేట్ డే ఐజ్వాల్, ఈటానగర్ లలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 24- నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 25- ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 26- న్యోకుమ్ ఈటానగర్ బ్యాంకులకు సెలవు
భౌతికంగా బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వినియోగదారులకు అందుబాటులోనే ఉండనున్నాయి. అందువల్ల డబ్బులు పొందటం, చెల్లించటంలలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలుస్తోంది. అయితే ఏదైనా పని పూర్తి చేసుకునేందుకు నేరుగా బ్యాంక్ ఖాతాకు వెళ్లాల్సిన వారు మాత్రం బ్యాంక్ హాలిడే క్యాలెండర్ తప్పనిసరిగా చూసుకుని ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications