Unclaimed Deposits: చాలా కాలంగా దేశంలోని బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు డిపాజిట్ల రూపంలో మూలుగుతోంది. అయితే ఈ డబ్బుకు యజమానులు ఎవరనే విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ఆ మెుత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనేక చర్యలు చేపడుతోంది.
వాస్తవానికి భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు నిరంతరం పెరుగుతూనే ఉండటంపై కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని సారించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగింది. దీంతో మెుత్తం ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బు రూ.78,213 కోట్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరూ లేరు. ఈ సమస్య రానున్న కాలంలో పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనతో వచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కారణంగానే బ్యాంకింగ్ నిబంధనలను మార్చారు.

భవిష్యత్తుల్లో బ్యాంకుల్లో ఇలా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరగకుండా చూసేందుకు ఇకపై బ్యాంక్ ఖాతాదారులు తమ అకౌంట్లకు ప్రస్తుతం ఉన్న ఒక నామినీకి బదులుగా నలుగురు నామినీలను పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలని బ్యాంకింగ్ చట్టాల్లో మార్పును ప్రతిపాదించింది. అలాగే బ్యాంక్ పాలనను మెరుగుపరచడానికి, పెట్టుబడిదారుల రక్షణను పెంచడానికి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమవరణల గురించి లోక్‌సభలో చెప్పారు.
నామినీ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోజనాలేంటి?
ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు, పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ఖాతాలకు నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దీనివల్ల సదరు ఖాతాదారులు మరణించిన సందర్భంలో తన పెట్టుబుడులు లేదా డిపాజిట్లు చట్టప్రకారం ఎవరికి చెందాలనే విషయం సదరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు తెలుస్తుంది.
ఖాతాదారుడు పొందుపరిచిన నామినీలు వాటిని క్లెయిమ్ చేసుకోవటానికి అర్హులు. దీనివల్ల ఆర్థిక సంస్థల వద్ద అన్ క్లెయమ్స్ డిపాజిట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ మిగిలిపోకుండా ఉంటాయి. నామినీ వివరాలు యాజమాన్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీ వివరాలను అందించటంతో పాటు ఆ వివరాలను కుటుంబ సభ్యులకు షేర్ చేయటం ఉత్తమం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications