Banking News: సామాన్యుల నుంచి కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు.. మరీ ఇంత దారుణమా..!!
Banking News: ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు చాలా తెలివి మీరాయి. వాటికి అసలు వ్యాపారం ద్వారా ఆదాయం కంటే కొసరు ఆదాయం భారీగా కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వసూళ్ల దందా చూస్తే కళ్లు భైర్లు కమ్మకమానదు.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 5 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి బ్యాంక్ ఖాతాదారుల నుంచి రూ.35,000 కోట్లకు పైగా ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. మినిమమ్ బ్యాలెన్స్, లిమిట్ మింటి ATM లావాదేవీలు వంటి కారణాలతో ఈ సొమ్మును వసూలు చేశాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు రూ.21,000 కోట్లు, అదనపు ATM లావాదేవీల రూ.8,000 కోట్లు, SMS సేవలకు రూ.6,000 కోట్లు వసూలయ్యాయి.

ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ ఉన్న నగరం ప్రకారం వసూలు చేసే ఛార్జీలు మారిపోతుంటాయి. మెట్రో నగరాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000 నుంచి రూ.10,000గా ఉంది. పట్టణాల్లో రూ.2,000-రూ.5,000గా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. వీటిని పాటించని విషయంలో రూ.500 వరకు ఛార్జీల రూపంలో విధించవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా AMB నాన్-కాంప్లైన్స్ ఛార్జీలతో పాటుగా ఒక్కో లావాదేవీకి సాధారణంగా రూ.100-రూ.125 వరకు నగదు లావాదేవీల రుసుమును విధిస్తుంటాయి.

ఇక ఏటీఎంలలో లావాదేవీల పరిమితిని గమనిస్తే.. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు గరిష్ఠంగా 5 లావాదేవీలను ఉచింతగా చేసుకోవచ్చు. అదే ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మూడు లావాదేవీల వరకు నెలకు ఉచితంగా పొందవచ్చు. వీటి తర్వాత ప్రతి లావాదేవీకి రూ.21 ఛార్జీ విధించబడుతుంది. అయితే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఒక నెలలో చేసే డిపాజిట్ల సంఖ్య మరియు విలువపై ఎటువంటి పరిమితి లేదు.


Click it and Unblock the Notifications