Loan: మారిన లోన్, క్రెడిట్ కార్డ్ నియమాలు.. కస్టమర్లకు ఇక చుక్కలే..!!
Loan: దేశంలో రోజురోజుకూ రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే దీనిని కట్టడి చేసేందుకు రిజర్వు బ్యాంక్ రంగంలోని దిగటం అటు ఫైనాన్స్ కంపెనీలను, ఇటు వినియోగదారులను కొత్త రుణాల విషయంలో ఇబ్బందులను కలిగిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ అన్‌సెక్యూర్డ్ రుణాలపై నిబంధనలను కఠినతరం చేయడం ఫైనాన్స్ సంస్థలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఆర్బీఐ రిస్క్ వెయిటేజీని పెంచటం వల్ల దేశంలోని బ్యాంకులకు అదనంగా రూ.84,000 కోట్ల మూలధనం అవసరం అవుతుంది. ఈ క్రమంలో పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్‌లు వంటి రుణాలకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేస్తూ సదరు రుణాలపై రిస్క్ వెయిటేజీని 25 శాతం పెంచింది.

రిస్క్ వెయిటేజీని పెంచే నిర్ణయం ద్వారా బహుశా ఆర్‌బీఐ బలమైన సందేశాన్ని అందించిందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. దీని ద్వారా ఏదైనా ప్రారంభ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన నష్టాలను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు సందేశాన్ని ఇచ్చింది. అలాగే ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని.. ఇది పరోక్షంగా రుణ వృద్ధిని తగ్గిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో బలహీన ఆర్థిక సంస్థలకు మూలధనాన్ని సమీకరించాల్సిన అవసరం పెరుగుతుందని S&P గ్లోబల్ రేటింగ్స్‌లో క్రెడిట్ అనలిస్ట్ గీతా చుగ్ అన్నారు.
ఈ మార్పులు భారత ఆర్థిక రంగం క్రెడిట్ యోగ్యతపై తక్షణ ప్రభావం చూపబోవని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. రేట్ చేయబడిన బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల రిస్క్-సర్దుబాటు మూలధన నిష్పత్తిని కూడా ఇది ప్రభావితం చేయదని తెలుస్తోంది. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా అసురక్షిత వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలు వేగంగా పెరిగాయని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2023తో ముగిసిన 12 నెలల్లో అటువంటి రుణాల్లో 26 శాతం పెరుగుదల నమోదైంది.


Click it and Unblock the Notifications