ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు శనివారం అక్టోబర్ 29, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధిలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను 90 bps వరకు పెంచింది. 7 రోజుల నుంచి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇండియన్ బ్యాంక్ 2.80% నుంచి 6.30% వరకుఅందిస్తోంది.

శనివారం నుంచి
శనివారం నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు ఇండియన్ బ్యాంక్‌లో గరిష్ఠంగా 6.50% వడ్డీ రేటు లభిస్తుంది. 7 రోజుల నుంచి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.80% వద్ద స్థిరంగా ఉంచింది. 30 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.00% వడ్డీ రేటును ఇస్తోంది. 46, 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.25% వడ్డీని అందిస్తోంది. 121 రోజుల నుంచి 180 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, ఇండియన్ బ్యాంక్ 3.85% వడ్డీ రేటును ఇస్తోంది.

4.75% వడ్డీ రేటు
9 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 4.75% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. ఇండియన్ బ్యాంక్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50% నుండి 6.30% వరకు పెంచింది. 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 90 bps పెంచింది 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 6.40% వడ్డీ రేటును పొందుతారు.

సీనియర్ సిటిజన్లు
సీనియర్ సిటిజన్‌ల కోసం డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై సంవత్సరానికి 0.50% అదనపు వడ్డీ రేటు చెల్లించనున్నారు. IB గోల్డెన్ ఏజ్ స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ సూపర్ సీనియర్ సిటిజన్‌ల కోసం (80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అన్ని డిపాజిట్ టేనర్‌లకు టర్మ్ డిపాజిట్‌పై ప్రామాణిక సీనియర్ సిటిజన్‌లకు ప్రస్తుతం ఇస్తున్న అదనపు రేటు కంటే అదనంగా 0.25% అధిక వడ్డీ రేటును అందిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications