Tata Motors: షాకింగ్.. వాణిజ్య వాహనాల రేట్లు పెంచనున్న టాటా మోటార్స్..!!
Vehicle Prices Hike: భారతీయ ఆటోమోటివ్ తయారీదారు అయిన టాటా మోటార్స్ జనవరి 1, 2024 నుంచి వాణిజ్య వాహనాల రేట్లను 3% మేర పెంచాలని నిర్మయించింది. కొంత కాలంగా పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో వాణిజ్య లైనప్‌లోని టాటా ఏస్, టాటా ఇంట్రా, టాటా వింగర్ వంటి ప్రసిద్ధ మోడళ్లను కలిగి ఉన్న వాణిజ్య వాహనాల పూర్తి స్పెక్ట్రమ్‌లో పెరుగుదల అమలు చేయబడుతుంది. టాటా మోటార్స్ నవంబర్ 2023కి దాని గ్లోబల్ అమ్మకాల్లో స్వల్పంగా 1.73% తగ్గుదలని వెల్లడించింది. గత సంవత్సరం ఇదే నెలలో 75,478 యూనిట్లతో పోలిస్తే.. స్వల్పంగా తగ్గి 74,172 యూనిట్ల విక్రయాన్ని నమోదు చేసింది.

వాణిజ్య వాహనాల విభాగంలో అమ్మకాలు 4% తగ్గాయి. నవంబర్ 2023 గణాంకాలు మొత్తం 28,029 యూనిట్లు, గత సంవత్సరం ఇదే నెలలో 29,053 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే టాటా మోటార్స్ రానున్న జనవరిలో ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కలుపుకుని ధరల పెంపు ఉంటుందని ఆటోమోటివ్ కంపెనీ గతంలోనే ధృవీకరించింది.
ఈ నెల ప్రారంభంలో మహీంద్రా & మహీంద్రా జనవరి 2024 నుంచి ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్ మోడళ్ల శ్రేణిలో ధరల పెంపుదలని అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ద్రవ్యోర్బణంతో పాటు కమోడిటీ ధరల పెరుగుదల ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది. ఆటోమోటివ్ రంగంలోని మిగిలిన కంపెనీలు సైతం త్వరలో ఇదే దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
జనవరిలో తన వాహనాల ధరలను పెంచడం ద్వారా హోండా కార్స్ ఇండియా దీనిని అనుసరించనుంది. జపనీస్ వాహన తయారీ సంస్థ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలివేట్, సిటీ, అమేజ్ అనే మూడు మోడళ్లను అందిస్తోంది. అలాగే లగ్జరీ కార్ డీలర్ ఆడి అధికారికంగా 2% ధరల పెంపును ప్రకటించింది. మెర్సిడెస్-బెంజ్ కూడా ఇదే విధమైన సర్దుబాటును పరిశీలిస్తోంది.


Click it and Unblock the Notifications