Bajaj Auto: రూ.4000 కోట్ల షేర్ బైబ్యాక్ ప్రకటన.. రిటైలర్స్ ఇవి తెలుసుకోండి..
Share Buy Back: దేశంలో అతిపెద్ద టూవీలర్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్ ప్రకటన చేసింది. ఇందుకోసం రిటైల్ యాక్సెప్టబిలిటీ రేటు 3.90గా ఉంది.
వాస్తవానికి షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని బజాజ్ ఆటో లిమిటెడ్ బోర్డు నిర్ణయించింది. అయితే దీనిని టెండర్ ఆఫర్ రూపంలో పూర్తి చేయాలని చూస్తోంది. తాజా బైబ్యాక్ ద్వారా రూ.4000 కోట్లు విలువైన షేర్లను కొనాలని నిర్ణయించింది. ఇందుకోసం బైబ్యాక్ షేర్ ధరను ఒక్కొక్కదానికి రూ.10,000గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ క్రమంలో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్ల ధర రూ.6,985.70 వద్ద ముగిశాయి. ప్రస్తుతం మార్కెట్లో ట్రేడింగ్ ధర కంటే 43.14 శాతం ప్రీమియం రేటుకు షేర్లను కొనాలని కంపెనీ నిర్ణయించటంతో ఇన్వెస్టర్లలో కోలాహలం నెలకొంది. ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో ద్వారా 10 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన 4,000,000 పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను మొత్తం పెయిడ్ క్యాపిటల్‌లో 1.41 శాతానికి ప్రాతినిధ్యం వహించే ప్రతిపాదనను బోర్డు ఆమోదిస్తున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది.
కంపెనీ రిటైలర్ల నుంచి షేర్లను 4-10 శాతం మధ్య అంగీకరించాలని చూస్తోంది. అయితే షేర్ల బైబ్యాక్ ఎప్పుడు ప్రారంభించబడుతుందనే కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే బజాజ్ ఆటో బోర్డ్ ఒక బైబ్యాక్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బజాజ్ ఆటోలో మెుత్తం 64 మంది ప్రమోటర్లు కంపెనీలో 54.94 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇక ఎఫ్‌పీఐలు 14.72 శాతం వాటాను, మ్యూచువల్ ఫండ్స్ 5.35 శాతం, ఇన్సూరెన్స్ కంపెనీలు 3.21 శాతం ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications