ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం, రియల్ ఎస్టేట్ లేదా టెక్నాలజీ స్టాక్స్ వైపు పరుగులు తీస్తుంటారు. కానీ, సైలెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఒక పరిశ్రమ మాత్రం విదేశీ మార్కెట్లను వణికిస్తోంది. అదే 'లిక్కర్ ఇండస్ట్రీ'. స్కాట్లాండ్ నుండి జపాన్ వరకు ఉన్న దిగ్గజ బ్రాండ్లకు చుక్కలు చూపిస్తూ.. మన దేశీ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్‌లో రారాజులుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీని తయారు చేసే దేశం ఏదైనా ఉందంటే అది 'భారతదేశం' అని విదేశీయులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. మన దేశీ బ్రాండ్లు గ్లోబల్ అవార్డులను కొల్లగొట్టడమే కాకుండా.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అసలు ఈ 'మత్తు' వెనుక ఉన్న 'బిజినెస్ మ్యాజిక్' ఏంటి? మన విస్కీ బ్రాండ్లు (whisky brands) ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాయి? ఈ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం!

భారతీయ లిక్కర్ స్టోరీ ఒక ఆసక్తికరమైన మలుపుతో మొదలైంది. భారతదేశపు మొట్టమొదటి సింగిల్ మాల్ట్ విస్కీ 'అమృత్' (Amrut) ప్రారంభించిన జగదలే కుటుంబం ఒక దశలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. అప్పట్లో భారతీయ విస్కీకి అంతర్జాతీయ గుర్తింపు లేదు. దేశీయంగా కూడా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. వ్యాపారం మానేయాలని వారు నిర్ణయించుకున్న తరుణంలో, లండన్‌లోని గాంధీ విగ్రహం వారిలో కొత్త ఆశను నింపింది. గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెనకడుగు వేసి ఉంటే చరిత్ర మరోలా ఉండేదని భావించిన నీలకంఠ జగదలే.. తన విస్కీని ప్రపంచ వేదికపై నిలబెట్టాలని పట్టుబట్టారు. ఆ పట్టుదలే నేడు భారతీయ లిక్కర్ పరిశ్రమను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చింది.
బిలియన్ డాలర్ల మార్కెట్ దిశగా..
ఒకప్పుడు భారతీయ మద్యం అంటే తక్కువ నాణ్యత కలిగిన 'IMFL' (Indian Made Foreign Liquor) అనే ముద్ర ఉండేది. కానీ, గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025 నాటికి భారతదేశపు దేశీయ మద్యం మార్కెట్ విలువ రూ.3.25 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ప్రతి ఏటా 10% వృద్ధితో దూసుకెళ్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారతీయ బ్రాండ్లు జెండా పాతతున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్పిరిట్స్ విభాగంలో భారతీయ బ్రాండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, గత ఏడాది భారతీయ మద్యం ఎగుమతులు రూ.3,000 కోట్లు దాటగా.. 2030 నాటికి ఇది 1 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 8,500 కోట్ల మార్కును చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌లో లిక్కర్ షేర్ల జోరు
భారతీయ కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో రాణిస్తుండటంతో.. షేర్ మార్కెట్ లో కూడా వీటి ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన కంపెనీల ప్రస్తుత బిజినెస్ ను పరిశీలిస్తే..
- యునైటెడ్ స్పిరిట్స్ (United spirits ltd): ఇది దాదాపు రూ.1,04,025 కోట్ల మార్కెట్ విలువతో మార్కెట్లో అగ్రగామిగా ఉంది. దీని షేర్ ధర ప్రస్తుతం రూ.1,418 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ 'గోడవన్' వంటి ప్రీమియం బ్రాండ్లపై దృష్టి పెట్టడం వల్ల లాభాల శాతం విపరీతంగా పెరిగింది.
- రాడికో ఖైతాన్ (Radico Khaitan): షేర్ ధర ఏకంగా రూ. 3,190 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.43,579 కోట్లుగా ఉంది. రాంపూర్ సింగిల్ మాల్ట్, జైసల్మేర్ జిన్ వంటి ఉత్పత్తులు ఈ కంపెనీ జాతకాన్ని మార్చేశాయి.
- యునైటెడ్ బ్రీవరీస్ (UBL): బీర్ మార్కెట్లో రారాజుగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 42,857 కోట్లు కాగా.. షేర్ ధర రూ.1,620 వద్ద కొనసాగుతోంది.
- పికాడిల్లీ ఆగ్రో(Piccadily): 'ఇంద్రి' విస్కీ సృష్టికర్త అయిన ఈ కంపెనీ షేర్ ధర రూ.543 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లకు ఇది గత రెండేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ను అందించింది.
భారతీయ వాతావరణం: కంపెనీలకు కలిసొచ్చే అంశం
వ్యాపార కోణంలో చూస్తే.. భారతదేశంలో ఉన్న భిన్నమైన వాతావరణం మనకు అతిపెద్ద వరం. స్కాట్లాండ్ లో విస్కీ పక్వానికి ( whisky ageing) రావడానికి 10 నుండి 12 ఏళ్లు పడుతుంది. కానీ, భారత్ లోని అధిక ఉష్ణోగ్రతల వల్ల కేవలం 3 నుండి 4 ఏళ్లలోనే అదే స్థాయి నాణ్యత, రుచి లభిస్తుంది. దీనివల్ల కంపెనీలకు ఇన్వెంటరీ హోల్డింగ్ ఖర్చు తగ్గి.. తక్కువ సమయంలోనే నాణ్యమైన ఉత్పత్తిని మార్కెట్లోకి పంపే అవకాశం ఉంటుంది. ఇదే పారిశ్రామిక వేత్తలకు మరియు ఇన్వెస్టర్లకు పెద్ద ప్లస్ పాయింట్.
ప్రీమియం బ్రాండ్లే తాగాలి.. మారుతున్న ట్రెండ్..
ప్రస్తుతం భారతీయ యువతలో 'తక్కువ తాగినా.. నాణ్యమైనది తాగాలి' అనే ధోరణి పెరిగింది. దీనివల్ల కంపెనీలు సామాన్య బ్రాండ్ల కంటే ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ మార్జిన్ పొందుతున్నాయి. హర్యానాకు చెందిన 'ఇంద్రి' (Indri) వంటి బ్రాండ్లు 'వరల్డ్ బెస్ట్ విస్కీ' (World's best whisky) అవార్డులు సాధించడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. డియాజియో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశాన్ని తమ 'గ్లోబల్ హబ్'గా మార్చుకుంటున్నాయి.
ఎదురుచూస్తున్న సవాళ్లు
ఈ రంగంలో సవాళ్లు కూడా లేకపోలేదు. భారతదేశంలో మద్యం అనేది 'స్టేట్ సబ్జెక్ట్'. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎక్సైజ్ పాలసీ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్నులు ఉండటం వల్ల కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించడం కొంచెం కష్టతరంగా మారుతోంది. ఉదాహరణకు.. మహారాష్ట్ర లేదా కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పన్నులు పెంచినప్పుడు కంపెనీల ఆదాయంపై ప్రభావం పడుతుంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపు ఈ ఇబ్బందులను అధిగమించేలా చేస్తోంది.
మేడ్ ఇన్ ఇండియా 'స్పిరిట్'తో..
మిగతా రంగాలతో పాటు లిక్కర్ ఇండస్ట్రీ కూడా మేడిన్ ఇండియా స్పిరిట్ ను అందిపుచ్చుకుంది. నేడు విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి అమెరికా, యూరప్ లోని లగ్జరీ బార్ల వరకు.. 'మేడ్ ఇన్ ఇండియా' విస్కీ బాటిళ్లు (whisky bottles) గర్వంగా కనిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్, రానా దగ్గుబాటి వంటి సినీ తారలు సైతం ఈ రంగంలోకి పెట్టుబడులతో రావడం పరిశ్రమకు మరింత గ్లామర్‌ను తెచ్చింది. స్కాట్లాండ్ విస్కీకి ఏమాత్రం తీసిపోని విధంగా మన ఉత్పత్తులు ఉన్నాయని ప్రపంచం ఒప్పుకుంటోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications