Adani: అదానీ గ్రూప్ ఆడిట్ సంస్థకు షాక్.. అకౌంటింగ్ రెగ్యులేటర్ విచారణ..
Adani Auditor: గౌతమ్ అదానీ కంపెనీలు ఈ ఏడాది అనేక ఆరోపణలు, దర్యాప్తులను ఎదుర్కొంటున్నారు. వ్యవహారం రాజకీయంగా మారటంతో కోర్టుల దాకా విషయం వెళ్లింది. అయితే ప్రస్తుతం ఇది మరిన్ని సమస్యలకు దారితీసేలా కనిపిస్తోంది.
దేశంలోని అకౌంటింగ్ రెగ్యులేటర్ అయిన నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(NFRA) తాజాగా అదానీ వ్యవహారంలో రంగంలోకి దిగింది. అదానీ గ్రూప్ కంపెనీలకు అనేక సంవత్సరాలుగా ఆడిటర్లుగా ఉన్న EY(Ernst & Young) సభ్య సంస్థల్లో ఒకదానిపై విచారణ ప్రారంభించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

దేశంలోని EY సభ్య సంస్థల్లో ఒకటైన SR బాట్లిబోయ్‌పై విచారణ ప్రారంభించినట్లు వెలుగులోకి వచ్చింది. 2014 వరకు బిలియనీర్ గౌతమ్ అదానీ నియంత్రణలో ఉన్న కొన్ని కంపెనీలపై ఆడిట్‌లకు సంబంధించిన ఫైల్స్, కమ్యూనికేషన్‌లను రెగ్యులేటర్ సదరు అకౌంటింగ్ సంస్థ నుంచి సేకరిస్తోంది. NFRA విచారణ ఎంతకాలం పడుతుంది లేదా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియాల్సి ఉంది.
అదానీ గ్రూప్‌లో భారీగా ఆదాయాన్ని కలిగి ఉన్న 5 లిస్టెడ్ కంపెనీలకు SR బాట్లిబోయ్ సంస్థ చట్టబద్ధమైన ఆడిటర్‌గా వ్యవహరించటంతో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరిలో షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపణలను ఎదుర్కొన్న పోర్ట్స్-టు-పవర్ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ ప్రధానంగా అకౌంటింగ్, డిస్‌క్లోజర్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అయితే కార్పొరేట్ అక్రమాలకు సంబంధించిన హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. ప్రస్తుతం దీనిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీచే కోర్టు-ఆదేశిత విచారణలో కూడా కొనసాగుతోంది.
దేశంలో చట్టప్రకారం పెద్ద విదేశీ ఆడిట్ సంస్థలు నేరుగా తమ పనిచేసేందుకు కుదరదు కాబట్టి అనుబంధ సంస్థల ద్వారా కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో అదానీ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్, అదానీ సిమెంట్ వ్యాపారాలు, పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అకౌంటింగ్ పుస్తకాల్లో SR బాట్లీబోయ్ సంతకాలు చేసింది. దీంతో వ్యవహారం మరింత వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి విషయం కొంత రహస్యంగానే విచారణ జరుగుతున్నట్లు నివేదిక చెబుతోంది.


Click it and Unblock the Notifications